పుత్ర శోకం: నీటి గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి...
11 నెలల చిన్నారి ప్రమాదవ శాత్తు నీటిగుంతలో పడి మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీ నగర్‌లో జరిగింది. గాంధీనగర్‌కు చెందిన బోడా ప్రసాద్, అరుణ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు తన్మయశ్రీ వయసు రెండేళ్లు కాగా.. కుమారుడు తన్వీష్ వయసు 11 నెలలు. కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తారు.
ప్రసాద్ ఉదయాన్నే మిర్చి బస్తాలు తొక్కే పనికి వెళ్లగా.. అరుణ ఇంటిపనిలో నిమగ్నమైంది. తన్వీష్ ఆడుకుంటూ ఆడుకుంటూ తమ ఇంటి సమీపంలో గల తాతయ్య బోడా బాలు ఇంటివైపు వెళ్లి.. ఆయన ఇంటి ఎదురుగా ఉన్న వృథానీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన గుంతలో పడి పోయాడు. అయితే అందులో నిల్వ ఉన్న నీటిలో మునిగిపోయాడు. కాసేపటి తర్వాత కుమారుడు కనిపించడం లేదని తల్లి అరుణ చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా కనిపించకపోవడంతో.. అనుమానం వచ్చి గుంతలో చూడగా బాలుడు కనిపించాడు.

బాలుడని జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకుం టున్న తమ కుమారుడు ఇలా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెల విసేలా రోదించారు. 2019 జనవరిలో ప్రసాద్ సోదరుడు రవి కుమార్తె గౌతమి.. గాంధీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇప్పటికీ ఆ సంఘటన నుంచి వారి కుటుంబం కోలుకోకముందే అదే కుటుంబంలో మరో విషాదం జరగిందని గ్రామస్తులు అంటున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications