ఐనవోలులో సినీ సందడి: ‘వాలుజెడ’తొలి సన్నివేశం చిత్రీకరణ

ఐనవోలు మండలం కేంద్రంలోని మల్లికార్జున స్వామి జాతరలో శనివారం సినిమా షూటింగ్‌ సందడి చేసింది.

జనగామ: ఐనవోలు మండలం కేంద్రంలోని మల్లికార్జున స్వామి జాతరలో శనివారం సినిమా షూటింగ్‌ సందడి చేసింది. సింహవాహిని బ్యానర్‌పై చిత్రీకరిస్తున్న సినిమాకు 'వాలుజెడ' నామకరణం చేశారు. ఇందులో ఉత్తరాది హీరో రవిణ్‌సంజయ్‌, తమిళ కథానాయిక సాయి ధన్సిక నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో చిత్రీకరిస్తున్నారు.

జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం తిమ్మంపేటకు చెందిన రమణ మల్లం సనిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు గతంలో గౌతం డైరెక్టర్‌ వద్ద కోడైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఐనవోలు దేవస్థానం జాతర ప్రాశస్త్యం, రాజరికపు ఆనవాళ్లు, ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలపై మక్కువతో తన తొలి సినిమా తొలి షాట్‌ను చిత్రీకరించాలని ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

inavolu

హీరోయిన్‌ ధన్సిక.. కబాలి సినిమాలో రజనీకాంత్‌ కూతురిగా నటించింది. ఈ సినిమాకు నిర్మాతగా సిరపరాల నాగరాజు, పాటల రచయితలు చంద్రబోస్‌ కందికొండ, సురేందర్‌ మిట్టపల్లి, ఫొటోగ్రఫీ సిద్ధార్థ రామస్వామి, సంగీత దర్శకుడిగా రథన్‌లు వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో షూటింగ్‌ పూర్తిచేసి తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఓ వైపు జాతర వైభవంగా జరుగుతుండగా, సినిమా షూటింగ్‌తో మరింత సందడి నెలకొంది.

తొలి సన్నివేశం చిత్రీకరణలో భక్తుల తాకిడి

సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలసుకున్న యువకులు, భక్తులు చూడటానికి పోటీపడగా చిత్ర యూనిట్ బృందం ఇబ్బందులు పడ్డారు. వాహనంలో మరొక స్త్రీని కూర్చుండబెట్టి దారి మళ్లించడంతో యువకులు కారు వెంట పరుగులు తీశారు. తదుపరి ఈవో కార్యాలయం నుంచి మరో కారులో ఆలయం పడమర వైపు వచ్చారు. స్త్రీల వేషధారణలో బోనాలు ఎత్తుకొని వస్తున్న వారి మధ్యలో హీరోయిన్‌ ధన్సిక కనించింది. అనంతరం ఆలయం ధ్వజస్తంభం వద్ద క్యూలైన్‌లో తప్పిపోయిన బాలుడిని వెతుకుతున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+