వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజురాబాద్ ఫలితాలపై సీఎం కేసీఆర్ పోస్ట్ మార్టం; మంత్రులు, ఇంచార్జ్ ల పనితీరుపై రిపోర్ట్ !!

|
Google Oneindia TeluguNews

హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ పరువు పోగొట్టుకొంది. ఎన్నికలకు ఐదు నెలల ముందు నుండే నియోజకవర్గ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యూహాలు రచించి హుజురాబాద్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా టిఆర్ఎస్ బాస్ కెసిఆర్ కు ఈటల రాజేందర్ భారీ షాక్ ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందు నుండే టిఆర్ఎస్ పార్టీ అన్ని మండలాలకు ఇన్చార్జి లను నియమించి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని, క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన వ్యూహాలకు పదును పెట్టింది. నియోజకవర్గంలో మండలాల వారీగా పాగా వేసిన ఇంచార్జ్ లు ఏ మండలంలోనూ అనుకున్న ఫలితాలు రాబట్టకపోవడంపై గులాబీ బాస్ కెసిఆర్ సీరియస్ గా ఉన్నారని సమాచారం.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో ఏపీ గంజాయికి లింక్; పవన్ కళ్యాణ్ టార్గెట్ జగన్ సర్కార్ .. వదిలేలా లేరుగా!!ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో ఏపీ గంజాయికి లింక్; పవన్ కళ్యాణ్ టార్గెట్ జగన్ సర్కార్ .. వదిలేలా లేరుగా!!

నియోజకవర్గంలో మండలాల వారీగా ఇంచార్జ్ ల పనితీరుపై కేసీఆర్ ఆరా

నియోజకవర్గంలో మండలాల వారీగా ఇంచార్జ్ ల పనితీరుపై కేసీఆర్ ఆరా

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర జిల్లాల నుంచి వెళ్లిన ఇన్చార్జులు ఏం చేశారు అన్న దానిపై గులాబీ బాస్ ఆరా తీస్తున్నారని తెలుస్తుంది. ఏ మండలానికి ఎవరు ఇంఛార్జిగా ఉన్నారు. ఆ మండలంలో ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రత్యర్థి ఈటలకు ఎంత ఓటింగ్ నమోదయింది. ఎక్కడ టీఆర్ఎస్ ఫెయిల్ అయింది? బిజెపి ఎక్కడ సక్సెస్ అయింది? వంటి అన్ని అంశాలపై మండలాల వారీగా సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకున్నారు. ఇక నియోజకవర్గంలో మండలాల ఇన్చార్జిగా వ్యవహరించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికల ఓటమి పై జరుగుతున్న పోస్టుమార్టం టెన్షన్ పెడుతుంది. వారిలో ఆందోళనకు కారణంగా మారింది. తమపై అధినేత ఎలాంటి యాక్షన్ కు దిగుతారో అన్న అనుమానం అందరిలో వ్యక్తమౌతుంది.

హుజురాబాద్ ఎఫెక్ట్ .. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టెన్షన్

హుజురాబాద్ ఎఫెక్ట్ .. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టెన్షన్

హుజురాబాద్ మునిసిపాలిటీకి మంత్రి గంగుల కమలాకర్ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఇక జమ్మికుంట మున్సిపాలిటీ బాధ్యతలను మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించారు. మండలానికి ఇద్దరికీ పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంచార్జ్ లుగా వ్యవహరించి ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్, చల్లా ధర్మారెడ్డి, బాల్క సుమన్, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గువ్వల బాలరాజు, వొడితెల సతీష్ కుమార్, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుంకే రవిశంకర్, నారదాసు లక్ష్మణ్ రావులు వివిధ మండలాలకు ఇంచార్జ్ లుగా వ్యవహరించారు. అందరి పనితీరును మంత్రి హరీష్ రావు పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వారిని ముందుకు నడిపించారు.

 ఐదు నెలల పాటు పాగా వేసి ప్రచారం చేసినా టీఆర్ఎస్ కు వర్కవుట్ కాని ఉప ఎన్నిక

ఐదు నెలల పాటు పాగా వేసి ప్రచారం చేసినా టీఆర్ఎస్ కు వర్కవుట్ కాని ఉప ఎన్నిక

హుజూరాబాద్ నియోజకవర్గం లో యుద్ధప్రాతిపదికన టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాగా వేసి మరీ ప్రజల ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు, డబ్బులు పంచారన్న ఆందోళనలు వ్యక్తమైనా ప్రజల మద్దతు మాత్రం ఈటల రాజేందర్ కే దక్కింది. ఇక ఈటల రాజేందర్ కు అనుకూలంగా ఉన్న వారిని తమ వైపు తిప్పుకొని ఈటల రాజేందర్ ను ఒంటరిని చెయ్యాలని టిఆర్ఎస్ పార్టీ ఎన్ని వ్యూహాలు రచించినా ప్రజలు ఈటల రాజేందర్ ను ఆదరించారు.

గులాబీ బాస్ తో మాట్లాడాలంటే భయపడుతున్న మంత్రులు, ఇంచార్జ్ లు

గులాబీ బాస్ తో మాట్లాడాలంటే భయపడుతున్న మంత్రులు, ఇంచార్జ్ లు

కమలాపూర్, ఇల్లంతకుంట, వీణవంక, హుజురాబాద్ మండలాలలో టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయని భావించినప్పటికీ, అక్కడ కూడా ఈటల రాజేందర్ కి ఎక్కువ మెజార్టీ రావడంతో ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఇంచార్జ్ లు ఆందోళనలో ఉన్నారు. లెక్కలతో సహా ఇన్చార్జిల పనితనంపై నివేదికలు తెచ్చుకున్న గులాబీ బాస్ కెసిఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న ఆందోళన గులాబీ నేతల్లో ప్రధానంగా కనిపిస్తుంది. అధినేత దగ్గరికి వెళ్లాలంటేనే మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడుతున్న పరిస్థితి ఉంది. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలపై గుర్రుగా ఉన్న కేసీఆర్ ఈ ఎన్నికల బాధ్యతలు నిర్వహించి ఫెయిల్ అయిన గులాబీ నేతలపై ఏం స్టెప్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

English summary
TRS Boss is doing post-mortem on the defeat of the TRS party in the Assembly by-elections in Huzurabad. Tensions are running high among ministers and leaders in the constituency over reports on the work of ministers and division wise in-charges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X