సీఎం కేసీఆర్ ఇక తేల్చేస్తారా - రేపే కీలక భేటీ : జాతీయ నేతలకు ఫోన్ - ఢిల్లీ వేదికగా..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటికే ఎన్నికలకు తాను సిద్దమని.. తేదీ ఇస్తే అసెంబ్లీ రద్దు చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన సీఎం కేసీఆర్..ఈ భేటీ ద్వారా తన లక్ష్యాన్ని స్పష్టం చేయనున్నారు. కొంత కాలంగా కేంద్రం పైన..ప్రధాని మోదీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీలతో కలిసి కేంద్రం పైన పోరాటానికి సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా.. రేపు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.

జాతీయ నేతలతో కేసీఆర్ చర్చలు
దీంతో..పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో సీఎం కేసీఆర్ రేపు (శనివారం) కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ విధానాల పైన తాను మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీసేందుకు సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. జాతీయ నాయకులకు సీఎం కెసిఆర్ ఫోన్ చేసారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ,ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ , బీహార్ ఆర్జెడీ నేత తేజస్వీయాదవ్., యుపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్ , శరద్ పవార్ , జాతీయ విపక్ష నేతలతో ఫోన్లో మాట్లాడిన సిఎం కెసిఆర్ పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు.

పార్లమెంట్ వేదికగా పోరాటం
కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరి పై సిఎం కెసిఆర్ వారితో చర్చించారు. అందులో భాగంగా పార్లమెంట్ వేదికగా బీజేపీ వ్యతిరేక పక్షాలతో కలిసి ఢిల్లీ వేదికగా సమరశంఖం పూరించేందుకు రంగం సిద్దం అవుతోంది. వ్యవసాయం.. ఉపాధి కల్పన.. పెట్టుబడుల ఉపసంహరణ.. జలవనరులు వంటి కీలక అంశాల పైన చర్చకు చేపట్టాల్సిన అంశాన్ని జాతీయ నేతలతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఇక, తెలంగాణ పై కేంద్ర చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిరసగా పార్లమెంట్ వేదికగా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి గతం కంటే భిన్నంగా పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించాలని పార్లమెంట్ సభ్యులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.

పార్టీ ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం
పార్లమెంట్ సమావేశాల సమయంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. విపక్షాలతో సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అదే సమయంలో ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విధంగా టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా రూపాంతర ప్రకటన పైన సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రజాస్వామ్య బద్దంగానే మోదీ ప్రభుత్వాన్ని దించుతామని చెప్పుకొచ్చిన కేసీఆర్.. అందులో భాగంగా.. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేదికగా అడుగులు ప్రారంభిస్తున్నారు. ఇక, రేపటి పార్లమెంట్ సభ్యుల సమావేశంలో కేసీఆర్ వారికి ఎటువంటి దిశా నిర్దేశం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications