ఆ నలుగురికి నో టికెట్:జులై-15న 80 మందితో బీఆర్ఎస్ తొలి జాబితా?
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో బీఆర్ ఎస్ ఇప్పటికే ప్రచార యుద్ధాన్ని ప్రారంభించింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్న కేసీఆర్.... డిసెంబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు చాలా అడ్వాన్స్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష పార్టీలు ఇంకా పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల దగ్గర ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా భావించిన కేసీఆర్, జులై 15న 80 మంది అభ్యర్థులతో తొలి జాబితా వెల్లడించడానికి సిద్ధమైపోయినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

హ్యాట్రిక్ విజయం కోసం కేసీఆర్ వ్యూహం!: ఇప్పటికే రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్...తెలంగాణలో హ్యాట్రిక్ విజయం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. దీనికోసం ఏడాది క్రితం నుంచే ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఈ మేరకు కేసీఆర్‌తో ఒప్పందం చేసుకున్న విషయం కూడా తెలిసిందే. పీకే టీం ద్వారా ఇప్పటికే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రహస్య సర్వేలు చేయించారని సమాచారం. ఆ సర్వేల ఆధారంగా ఎమ్మెల్యేల జాబితాను రెడీ చేశారని జాతీయ మీడియాలో సైతం వార్తలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలోనే జులై-15న 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేయడానికి కేసీఆర్ పూర్తిస్థాయిలో సిద్ధపడినట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇలా అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలను షాక్‌కు గురిచేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. 80 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఎవరు తమ అభ్యర్థి అనే విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది. అలకలు, బుజ్జగింపులు, పంచాయితీలు ఉంటే కూడా సర్దుబాటు చేసుకోవడానికి సమయం ఉంటుంది. సర్దుబాట్లు, పొత్తులు, అభ్యర్థుల మార్పు వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిన 39 స్థానాల్లో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని చెబుతున్నారు.

పాస్‌మార్కులు వస్తే టికెట్ లేనట్లే!: ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ టీంతో సర్వేలు చేయించారని, ఈ సర్వే రిపోర్టులో 40 నుంచి 45 శాతం మార్కులు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం ఈసారి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
35 శాతంతో పాస్ మార్కులు తెచ్చుకున్న ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి టికెట్ ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఫలానావారికి టికెట్ ఇవ్వకూడదని కేసీఆర్ పక్కనపెట్టిన పేర్లలో కొంతమంది సీనియర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
నలుగురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ టిక్కెట్లు రావా?: స్టింగ్ ఆపరేషన్‌లో భాగమైన నలుగురు ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తాండూరుకు చెందిన పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్‌కు చెందిన హర్షవర్ధన్ రెడ్డి, అచ్చంపేటకు చెందిన గువ్వల బాలరాజు, పినపాకకు చెందిన రేగా కాంతారావులకు ఈసారి పార్టీ టిక్కెట్లు దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ఈ నలుగురిని పార్టీ మారేందుకు ఉసిగొల్పింది. కేసీఆర్ ఈ కుట్రను ఏసీబీ ద్వారా బట్టబయలు చేశారు.

ట్రాప్ తర్వాత ఈ నలుగురు ఎమ్మెల్యేలను రోజుల తరబడి తన ప్రగతి భవన్‌లో ఉంచుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వారిని బెస్ట్ ఎమ్మెల్యేలుగా పొగిడారు. ఇటీవలి కాలంలో నలుగురిలో ఏ ఒక్కరికీ కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ నలుగురి గ్రాఫ్ కూడా అంతంతమాత్రమే అని, తమ ఎంపీలతో కూడా స్నేహపూర్వకంగా లేరని కేసీఆర్ సర్వేల్లో తేలింది.
రోహిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి మధ్య విబేధాలు సద్దుమణగడం లేదు. రోహిత్‌రెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తే ఓడించేందుకు వెనుకాడమని మహేందర్‌రెడ్డి మద్దతుదారులు బహిరంగంగా ప్రకటించారు. అలాగే హర్షవర్ధన్ రెడ్డి కి ప్రజల్లో పెద్ద మద్దతు లేదని సర్వేల్లో తేలింది. గువ్వల బాలరాజు భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారిందని అంటున్నారు.
-
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications