సీబీఐకి కాళేశ్వరం కేసు, రేవంత్ నిర్ణయం వెనుక - ఢిల్లీ రివర్స్ గేమ్..!!

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన చేతిలో ఉన్న ఆయుధాన్ని ప్రధాని మోదీకి అందించారు. కాళేశ్వరం కేసు విచారణ ను సీబీఐకి అప్పగించారు. సీబీఐ కేంద్రం చేతిలో పావుగా మారిందని రాహుల్ గాంధీ అండ్ కో విమర్శల వేళ రేవంత్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా. బూమ్ రాంగ్ అవుతుందా. తెర వెనుక ఏం జరుగుతోంది. బీఆర్ఎస్ కు ఉన్న ఆప్షన్ ఏంటి. ఇప్పుడు కాళేశ్వరం సీబీఐకి అప్పగింత వెనుక కీలక పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. రేవంత్ లక్ష్యం పైన చర్చ మొదలైంది.

నిర్ణయం వెనుక
కాళేశ్వరం పైన జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదిక పైన అసెంబ్లీలో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఈ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ అండ్ టీం రాష్ట్రానికి భారీ నష్టం చేసారని ఆరోపించారు. ఈ కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయం లో రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి అవకాశం లేకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసిన ఇప్పుడు ఈ కేసు సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రేవంత్ నిర్ణయం పైన రాజకీయం గా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ ద్విముఖ వ్యూహంతో హైకమాండ్ ను ఒప్పంచి ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ ఉంది. అయినా, ఇక్కడే కొత్త సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. సీబీఐ విశ్వసనీయత పైన రాహుల్ క్యాంపు విమర్శలు చేస్తూనే ఉంది.

cm-revanth-decided-to-hand-over-kaleswaram-case-to-cbi-whats-the-reason

అసలు టార్గెట్
సీబీఐ మోదీ చేతిలో కీలుబొమ్మగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక.. సీబీఐకి ఈ కేసు ఇవ్వటం ద్వారా కేసీఆర్ పైన రాజకీయ ప్రతీకారం.. కక్ష్య సాధింపు విమర్శలు తన మీదకు రాకుండా బీజేపీ నాయకత్వం కోర్టులోకి రేవంత్ బంతిని నెట్టేసారు. సీబీఐ విచారణ చేసి కేసీఆర్ ను దోషిగా తేల్చితే.. తన ప్రమేయం లేకుండానే తన లక్ష్యం నెరవేరుతుంది. సీబీఐ తేల్చకుంటే బీజేపీ - బీఆర్ఎస్ ఒక్కటేనని రేవంత్ ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కవిత లిక్కర్ కేసు లో బీజేపీ చర్యలు తీసుకోని కారణంగానే తాము నష్టపోయామని బీజేపీ తెలంగాణ నేతలు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అటు కేసీఆర్.. ఇటు బీజేపీని ఫిక్స్ చేయటమే లక్ష్యం గా రేవంత్ తన కత్తికి రెండు వైపులా పదును పెడుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఒక విధంగా బీజేపీని ఈ నిర్ణయం తో ఆత్మరక్షణలోకి నెట్టారనే విశ్లేషణలు ఉన్నాయి.

అక్కడే ట్విస్ట్
కాగా, ఇదే సమయంలో ఈ కేసులో ఏం జరిగినా.. రాజకీయంగా లెక్కలు మారటం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ ని దోషిగా చేసి ఎలాంటి చర్యలు తీసుకున్నా... సానుభూతి వస్తుందనే వాదన ఉంది. అదే సమయంలో చర్యలు తీసుకుంటే తనకు కలిసి వస్తుందని రేవంత్ లెక్కలు వేస్తున్నా .. అధికారం కోల్పోయిన తరువాత క్రమేణా కేసీఆర్ పైన అంత వ్యతిరేక భావం లేదనే వాదన ఉంది. అదే సమయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తే బీజేపీ - బీఆర్ఎస్ మధ్య ఎలాంటి పొత్తు లేదనే వాదన నిరూపితం అవుతుంది. అయితే.. కేసీఆర్ సైతం ఈ అంశాన్ని న్యాయ పరంగా ఎదుర్కుంటూనే రాజకీయంగా అనుకూలంగా మలచుకునే వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. దీంతో,
రానున్న రోజుల్లో ఈ నిర్ణయం కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+