Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా బ్రాండ్ అదే : సీఎం రేవంత్ రెడ్డి సంచలనం

యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కు రెండు రూపాయలకు కిలో బియ్యం, వై.యస్. రాజశేఖర్ రెడ్డికి జలయజ్ఞం ఎలాగైతే బ్రాండ్ గా మారిందో యంగ్ ఇండియాను తన బ్రాండ్ గా మార్చుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా​ మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ దగ్గర నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.

"యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కు రెండు రూపాయలకు కిలో బియ్యం, వై.యస్. రాజశేఖర్ రెడ్డికి జలయజ్ఞం ఎలాగైతే బ్రాండ్ గా మారిందో యంగ్ ఇండియాను తన బ్రాండ్ గా మార్చుకుంటా" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

cm-revanth-reddy-declares-young-india-as-his-brand-at-police-school-inauguration

నెహ్రూ వల్లే..
ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆనాడు పండిట్ జవహర్ నెహ్రూ గారి సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని గుర్తుచేశారు.నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందని కొనియాడారు

చరిత్రలో నిలిచిన ముఖ్యమంత్రులు
దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు.. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని వెల్లడించారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని అన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామని చెప్పారు.

ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ మా బ్రాండ్
దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని చెప్పిన సీఎం... ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్‌గా అభివర్ణించారు.నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని సీఎం రేవంత్ వివరించారు. ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నామని గుర్తుచేశారు.

బెస్ట్ యూనివర్శిటీగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ
ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉందనిదేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు.

ప్రీ స్కూల్ విధానం
ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు వివరించిన సీఎం రేవంత్... ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుతోందని అభిప్రాయపడ్డారు.ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి... ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సైనిక్ స్కూల్ కు ధీటుగా పోలీస్ స్కూల్ ను తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందన్న రేవంత్ రెడ్డి ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.

పోలీస్ స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని గుర్తుచేసిన సీఎం..సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీస్ స్కూల్ కు ఆర్ధిక సాయం అందించాలని పిలుపునిచ్చారు. పోలీస్ స్కూల్ కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలన్నారు.
ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం తరగతి గదులను సీఎం రేవంత్ పరిశీలించారు. అనంతరం గ్రౌండ్ లో పిల్లలతో కలిసి కొద్దిసేపు ఫుట్ బాల్ ఆడారు. రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల్లో ఈ స్కూల్ ను నిర్మించింది. సీఎం రేవంత్ సర్కార్ 2024 అక్టోబర్ 21న యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు శంకుస్థాపన చేసింది.

తెలంగాణలోని పోలీసు, అగ్నిమాపక, ఎక్సైజ్, SPF, జైళ్లలో అమరవీరులు.. ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాల పిల్లలకు ఈ స్కూల్ లో స్టడీ అందించనుంది . మొదటి విడతగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రారంభించనున్నారు. స్థానికులకు 15 శాతం అడ్మిషన్లు ఇవ్వనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+