భాగ్య విధాతకు రేవంత్ నివాళి..
Dr Manmohan Singh: ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఘనంగా నివాళి అర్పించింది. దేశం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరిగా, రాజనీతిజ్ఞుడిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారని, మానవీయ కోణంలో సంస్కరణలను చేపట్టిన ప్రధాని ఆయన చేసిన సేవ చిరస్మరణీయమని పేర్కొంది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రిగా పని చేశారు మన్మోహన్ సింగ్.

తీవ్ర ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాన్ని ఒంటిచేత్తో ఒడ్డెక్కించారు. ప్రపంచాన్ని కుదిపేసిన తీవ్ర మాంద్యం పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరలేదంటే దాని ప్రధాన కారణం మన్మోహన్ సింగ్ అనుసరించిన విధానాలే ప్రధాన కారణం. బ్యాంకింగ్ వ్యవస్థను ధృడంగా ఉంచగలిగారు మన్మోహన్ సింగ్.
ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరిగా, సంస్కర్తగా.. అన్నింటి కంటే మించి మన కాలంలోని మానవతావాదిగా ఆయన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం, ఆచరణీయమని అన్నారు. సద్గుణాలు, నిష్కళంకమైన పరిపాలనను సమగ్రంగా, సమర్థంగా మానవీయ కోణంలో దేశ ప్రజలకు అందించారని అన్నారు.
కొద్దిసేపటి కిందటే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లారు. పార్థివదేహానికి నివాళి అర్పించారు.
అగాధపు అంచుల నుండి, అద్భుత ప్రస్థానం వరకు మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం పోశారని రేవంత్ రెడ్డి అన్నారు. భారతీయ ఆర్ధిక వ్యవస్థకు భాగ్య విధాతగా అభివర్ణించారు. తమ హృదయాల్లో మన్మోహన్ సింగ్‌కు చెరిగిపోని స్థానం ఉంటుందని, ప్రతి భారతీయుడిలోనూ గుండెల్లో ఆయన స్థానం శాశ్వతమని నివాళి అర్పించారు.
Telangana Chief Minister Shri @revanth_anumula paid his last respects to Dr. Manmohan Singh ji at his residence in New Delhi. pic.twitter.com/1yJY5kf6TS
— Congress (@INCIndia) December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడు రోజుల పాటు అంటే ఆయన కన్నుమూసిన రోజైన 26 నుంచి జనవరి 1వ తేదీ వరకు అధికారికంగా ఎలాంటి ఉత్సవాలు, వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా జాతీయ పతాకాన్ని అవనతం చేసి ఉంచాలని సూచించింది.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications