హైదరాబాద్- బెంగళూర్ లైన్ కు మహార్దశ..? కేంద్ర మంత్రి గోయల్ తో సీఎం రేవంత్ భేటీ
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం చేయాలన్నారు. అంతేకాక హైదరాబాద్- బెంగళూరు ఏరో-డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం అయ్యారు. పలు కీలక విషయాలపై చర్చించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం అయ్యారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని గోయల్ కు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు దిల్లీలోని వాణిజ్య భవన్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్ (NICDIT) ఆమోదించిన రూ.596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
అంతేకాక హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్- విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజుబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ, ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేసిందని.. ఈ నేపథ్యంలో హైదరాబాద్- బెంగళూర్ పారిశ్రామిక కారిడార్ ను ఏరో- డిఫెన్స్ కారిడార్ గా మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications