కేసీఆర్! విర్రవీగొద్దు, నీ సంగతి చూస్తం: ‘దొంగదీక్ష’ అంటూ డీకే అరుణ వార్నింగ్
హైదరాబాద్: తనపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలకు ఘాటైన కౌంటర్లు ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చరిత్ర బట్టబయలు చేస్తామని అన్నారు. తమ చరిత్ర ఏమిటో చెప్పాలని అన్నారు.

అరుణమ్మ ఏంటో తెలుసు..
తాము అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ నుంచి సమాధానం రావడం లేదని డీకే అరుణ అన్నారు. తెలంగాణలో కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులేమీ లేవని అన్నారు. గద్వాల ప్రజల ప్రతి ఇంట్లో తన ఫొటో ఉంటుందని అన్నారు. తన వీడియోలు చూపించేదేమిటని ప్రశ్నించారు. అరుణమ్మ ఏందో పాలమూరు ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణ ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నారంటూ కేసీఆర్‌పై డీకే అరుణ మండిపడ్డారు.

బెదిరింపులకు భయపడేది లేదు.. నీ సంగతి చూస్తం
పాలమూరు ఎంపీగా ఏం చేశావని కేసీఆర్‌ను డీకే అరుణ ప్రశ్నించారు. బెదిరింపులకు వెనక్కి తగ్గమని, భయపడేది లేదని అన్నారు. నీ సంగతి చూస్తామంటూ కేసీఆర్‌ను ఆమె హెచ్చరించారు. కేసీఆర్ తిడితే మంచిది.. మేముంటే చెడ్డదా? అని అన్నారు. తెలంగాణ దొర అనుకుంటున్నావా? అని నిలదీశారు.

కేసీఆర్ మాటల్లో భయం..
కేసీఆర్ తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. కేసీఆర్ మాటల్లో భయం కనిపిస్తోందని డీకే అరుణ చెప్పారు. సీఎం అయిన తర్వాత కూడా కేసీఆర్ ఎలా మాట్లాడో నేర్చుకోలేదని అన్నారు. తెలంగాణ మహిళలకు కేసీఆర్ ద్రోహం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమం నీవు చేశావా? నీ బతుకుదెరువు కోసం, మనుగడ కోసమే ప్రయత్నించావని కేసీఆర్‌పై మండిపడ్డారు.

నీది దొంగ దీక్షని తెలిసినా...
‘టీడీపీలో మంత్రి పదవి ఇవ్వకుంటే టీఆర్ఎస్ పార్టీని పెట్టినవు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థుల ప్రాణాలు తీశావు. పిల్లలు తిరగబడితేనే నిరాహార దీక్షను కొనసాగించావు. నీమ్స్ ఆస్పత్రికి వెళితే నీ దొంగ దీక్ష తెలుస్తుంది. ఉద్యమం నీరుగారొద్దనే నీ దొంగ దీక్షను బయటపెట్టలేదు. కాంగ్రెస్ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదా?' అని కేసీఆర్‌పై డీకే అరుణ మండిపడ్డారు.

విర్రవీగొద్దు కేసీఆర్..
‘శవరాజకీయాలు చేసి కూర్చినెక్కినావు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి కోసం ఏం చేశావో శ్వేత పత్రం విడుదల చేయగలవా? 69ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారికి ఏం చేశావ్. కేసీఆర్.. అధికారంలో ఉన్నావని విర్రవీగకు.. ఇప్పుడు ఆపద్ధర్మ సీఎంవే. మా సభలకు బఠానీలు అమ్ముకునేటంత మంది రాలేదంటావా?' అని డీకే అరుణ తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఖబడ్ధార్ కేసీఆర్...
‘కాంగ్రెస్ సభలకు జనాలు రాకున్నా నీకంత భయమెందుకు? మీలా పైసలిచ్చి జనాలను రప్పించుకోలేదు. కాంగ్రెస్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే ఓర్చుకోలేకపోతున్నావ్. వనపర్తి సభకు ఎంతమంది వచ్చారు? జోగులాంబ తల్లి ఆశీర్వాదంతో కాంగ్రెస్ శంఖారావం పూరించింది. టీఆర్ఎస్‌ను గద్దె దించుతాం. తాము అధికారంలోకి వస్తాం. ఇదే చివరిసారి కూర్చి నీకు.. ఇప్పుడు టెంపరరీ సీఎంవే. పదవులు శాశ్వతం కాదు. శాపం పెడుతున్నా.. టీఆర్ఎస్ తెలంగాణ రాబందుల పార్టీ. తుదముట్టిస్తాం. ఖబడ్ధార్ కేసీఆర్' అంటూ డీకే అరుణ హెచ్చరించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications