పేదరికంపై కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది : వనపర్తి సభలో రాహుల్

Recommended Video

    Loksabha Election 2019 : పేదరికంపై కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది : వనపర్తి సభలో రాహుల్

    ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ను ఏకీపారేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. ఇచ్చిన హామీలను విస్మరించడంలో వారిద్దరూ దిట్ట అని విమర్శించారు. అబద్దాలు చెప్పి, విద్వేషాలు రెచ్చగొట్టడంలో వారిది వన్నేవేసిన చేయి అని మండిపడ్డారు. సోమవారం వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.

    పేదలపై బీజేపీ .. పేదరికంపై కాంగ్రెస్

    పేదలపై బీజేపీ .. పేదరికంపై కాంగ్రెస్

    ప్రధాని మోదీ పేదలపై సర్జికల్ స్ట్రైక్ చేశారని విమర్శించారు రాహుల్. అధికారం చేపట్టాక కాంగ్రెస్ పార్టీ పేదరికంపై లక్షిత దాడులు చేస్తోందని స్పష్టంచేశారు. పేదల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ క‌ృషిచేస్తోందని పేర్కొన్నారు. రైతుులు, నిరుద్యోగులు ఆత్మగౌరవంతో బతికేందుకు దోహదపడుతామని హామీనిచ్చారు.

    ఆదర్శ పథకం

    ఆదర్శ పథకం

    కాంగ్రెస్ పార్టీ రూపొందించిన కనీస ఆదాయ పథకం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు రాహుల్. ఈ పథకంతో పేదల ఖాతాలో ఏడాదికి రూ.72 వేలు జమ చేస్తామని పేర్కొన్నారు. చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తామని స్పష్టంచేశారు.

    ఆమీన్‌దార్‌కే చౌకీదార్

    ఆమీన్‌దార్‌కే చౌకీదార్

    దేశంలో ధనికులకే మోదీ కాపాలదారు అని విమర్శించారు రాహుల్ గాంధీ. మోదీ, కేసీఆర్ దొందూ దొందేనని విమర్శించారు. వీరిద్దరూ సంపన్నుల సంక్షేమం కోసమే పనిచేస్తారని చెప్పారు. మోదీకి కేసీఆర్ లంచం ఇస్తున్నారన్న రాహుల్ .. అబద్దాలు ప్రచారం చేయడంలో ఇద్దరూ ఒకటేనని విమర్శించారు.

    రీ డిజైనింగ్ పేరుతో అవినీతి

    రీ డిజైనింగ్ పేరుతో అవినీతి

    రాష్ట్రంలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో పేర్లు మార్చడమే కేసీఆర్‌కు తెలుసు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+