ఏడాది కుమారుడితో కలిసి పోలీసు రెండో భార్య ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: ఓ పోలీసు కానిస్టేబుల్ రెండో భార్య తన ఏడాది కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాదులోని బల్కంపేటలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు నిరోష (27) ఎస్ఆర్ నగర్ కానిస్టేబుల్ రాజారావు రెండో భార్య.

తన కుమారుడితో పాటు నిరోష గురువారం సాయంత్రం రైల్వే ట్రాక్‌పై నిలబడి ఉన్న విషయం గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు రంగంలోకి దిగి, ఆమెను పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Cop’s second wife attempts suicide

నిరోషా తానెవరో చెబుతూ తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని పోలీసులకు చెప్పింది. ఈ స్థితిలో రాజారావుకు ఇద్దరు భార్యలున్నారనే విషయం పోలీసులు కనిపెట్టారు. ఇటీవలి వరకు రాజారావు, ఇద్దరు భార్యలు కూడా కలిసి ఉంటూ వచ్చారు.

నెల రోజుల క్రితం నిరోషా తన కుమారుడితో యూసుఫ్‌గుడాలోని ఇంటికి మారింది. మొదటి భార్య నుంచి ఇక్కట్లు ఎదురు కావడంతో ఆమె ఇల్లు మారింది. కానిస్టేబుల్ రాజారావు నిరోషాకు నెలకు రూ.4,500 ఇస్తూ వస్తున్నాడు. నిరోషా మాత్రం 6 వేల రూపాయలు కావాలని అడిగింది. కౌన్సెలింగ్ చేసిన తర్వాత నిరోషాను ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆమెను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+