మరదలితో వివాహేతర సంబంధం: భార్య పంచాయితీ, మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ విఫలమైన కారణంగా ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడు కన్నుమూయగా, ప్రేయసి మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అవాక్కయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
విషయం ఏమిటంటే ఈ ఘటనలో చనిపోయిన ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి అక్క భర్త కావడమే. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాస్త క్రైమ్ స్టోరీగా మారింది. పోలీసుల కథనం ప్రకారం... చెన్నూరు మండలం చెళ్లాయిపేటకు చెందిన తిరుపతి అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన యువతితో రెండేళ్ల క్రితం పెళ్లైంది.
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి కుటుంబంలోకి మరదలు(18) రావడంతో కష్టాలు మొదలయ్యాయి. మరదలు తన ఇంటికి వచ్చినప్పటి నుంచీ ఆమెతో సన్నిహితంగా ఉంటూ భార్యను నిర్లక్ష్యం చేయసాగాడు తిరుపతి. అంతేకాదు మరదలితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు.

తన చెల్లెలితోనే భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవాడన్ని జీర్ణించుకోలేకపోయిన తిరుపతి భార్య రోజూ అతనితో గోడవ పడేది. ఇలా ఈ గొడవ ఒకరోజు తారాస్థాయికి చేరుకోవడంతో కుల పెద్దల వద్దకు విషయాన్ని తెలియజేసి పంచాయితీ పెట్టించింది. చావనైనా చస్తానుగానీ, భర్త మరొకరితో ఉండటం చూడలేనని పంచాయితీ పెద్దల మందు రోదించింది.
అయితే తన భార్య ఇలా కులపెద్దల ముందు తనన్ని పంచాయితీకి లాగడం, మరదలితో ప్రేమలో మునిగిపోయిన తిరుపతి.. జరిగిన పరిణామాలతో మనస్తాపానికి గురై మరదలితో కలిసి గతనెల 29న కరీంనగర్ జిల్లా మంథనికి వెళ్లాడు. మంథని శివార్లలో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.
అపస్మారక స్థితిలో పడి ఉన్న జంటను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే వారిద్దరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తిరుపతి బుధవారం ప్రాణాలు విడిచాడు. కాగా యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications