ఐదున ఇక్కడే ఉంటా, కెసిఆర్ మెడ నరుక్కుంటారా: నారాయణ
హైదరాబాద్: ఐదో తేదీన తాను ఇక్కడే ఉంటానని, హైదరాబాద్ వదిలి పెట్టి ఎక్కడికీ వెళ్లనని, ఆ రోజు సాయంత్రం మాట్లాడతానని, సొంత మెజార్టీతో గ్రేటర్ మేయర్ పీఠాన్ని తెరాస దక్కించుకోకుంటే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖఱ రావు మెడ నరుక్కుంటారా.. లేకుంటే నేను చెవి కోసుకుంటానని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు.
సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు నారాయణ తీవ్రంగా స్పందించారు. ఆదివారం నగరంలోని గౌలిపురా, అంబర్‌పేట డివిజన్లలో సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో నారాయణ పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఈసందర్భంగా మీడియాతో అన్నారు. కెసిఆర్ హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాలవారు ఉండవచ్చని, ఇది అందరి నగరమని అన్నారు. సీఎం కేసీఆర్ తనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు.
బైక్ ర్యాలీలో సీపీఐ గ్రేటర్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్, అంబర్‌పేట కౌన్సిల్ కార్యదర్శి పులిజాల గెల్వయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా నారాయణపై కేసీఆర్ వ్యాఖ్యల్ని తెలంగాణ రాష్ట్ర్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఖండించారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే తొలి సీఎంను చేస్తానని మాటతప్పిన కేసీఆరే ముందుగా తల నరుక్కోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications