థర్డ్ ఫ్రంట్‌పై సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు.. కూటమి ఏర్పాటు ఎప్పుడంటే..?

దేశంలో బీజేపీ వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాడాల్సిన అవసరం ఉందన్నారు సీపీఎం ప్రధాన కార్యదర్ధి సీతారాం ఏచూరి. ఇందుకోసం కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు ఎన్నికల తర్వాతే ఉంటుందని స్ఫష్టం చేశారు. తెలంగాణలో పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల సమయంలో తమ రాజకీయ వ్యూహం ఉంటుందని తేల్చిచెప్పారు. బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

 బీజేపీ ఓటమి లక్ష్యంగా ..

బీజేపీ ఓటమి లక్ష్యంగా ..


దేశంలో ఆర్థిక సంక్షోభం పెరిగిపోయిందన్నారు సీపీఎం ప్రధాన కార్యదర్ధి సీతారాం ఏచూరి. హైదరాబాద్‌లో నిర్వ‌హించిన‌ సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. ఈ సమాశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, పొత్తులు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు ఆయన చెప్పారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కల్పన లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాది పార్టీకి మద్దతు..

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాది పార్టీకి మద్దతు..


త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీల్లో పొత్తులపై ఒక నిర్థష్టమైన వ్యూహంతో ముందకు వెళ్తామని ఏచూరి తెలిపారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సమాజ్ వాది పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. బీజేపీ ఓడితేనే రాజ్యాంగానికి రక్షణ ఉటుందని పేర్కొన్నారు.

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఎన్నిక‌ల త‌ర్వాతే..

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఎన్నిక‌ల త‌ర్వాతే..

దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు చేశారు. 1996 నుంచి 2004 వరకు ఏర్పడిన ఫ్రంట్‌లపై వివరించారు. ప్రత్యామ్నాయ కూటమి ఎప్పుడైనా ఎన్నికల తర్వాతే ఏర్పడుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికల సమయానికి స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణం పొత్తులపై ఆలోచిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకపవనాలు వీస్తున్నాయని అన్నారు. దీనికి అనుగుణంగా బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా విపక్ష పార్టీలు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలతో పెట్రోల్ , డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెరిగిపోయాని మండిప‌డ్డారు.

ఎన్నికలను అడ్డకునేందుకు బీజేపీ య‌త్నం

ఎన్నికలను అడ్డకునేందుకు బీజేపీ య‌త్నం


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ఎన్నికల నిబంధనలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఏచూరి ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేశారు. ఎన్నికలను జరగకుండా అడ్డకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు కోడ్ ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్ సంఘటనపై స్పంధించిన ఏచూరి.. మోదీ హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా రోడ్డు మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. భద్రతా పరమైన నిర్లక్ష్యం జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+