మంత్రి నారాయణ కొడుకు మృతిపై డీసీపీ: రెప్పపాటు వేగంలో పిల్లర్‌ను ఢీకొట్టి...
కారు అతి వేగంగా పిల్లర్‌ను ఢీకొట్టడం వల్లనే ఏపీ మంత్రి పీ నారాయణ కుమారుడు నిషిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర దుర్మరణం పాలయ్యారని పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వర రావు బుధవారం తెలిపారు.
హైదరాబాద్: కారు అతి వేగంగా పిల్లర్‌ను ఢీకొట్టడం వల్లనే ఏపీ మంత్రి పీ నారాయణ కుమారుడు నిషిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర దుర్మరణం పాలయ్యారని పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వర రావు బుధవారం తెలిపారు.

అదుపుతప్పి
కారు నారాయణగూడ నుంచి పెద్దమ్మ గుడి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్న సమయంలో అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిందని డీసీపీ తెలిపారు. తెల్లవారుజామున 2.45-2.50 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగిందన్నారు.

కారు వేగంగా ఢీకొట్టి వెనక్కి వచ్చింది
కారు వేగంగా పిల్లర్‌ను ఢీకొట్టి తిరిగి కొంత వెనక్కి వచ్చిందన్నారు. ప్రమాదం కారణంగా భారీ శబ్దం రావడంతో ఆ పరిసర ప్రాంతంలో నైట్ రౌండ్స్‌లో ఉన్న తమ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని కారులో చిక్కుకున్న ఇద్దరు యువకులను అతి కష్టమ్మీద బయటకు తీశారని డీసీపీ తెలిపారు.

బెలూన్లు ఓపెన్ అయినా..
బెలూన్లు సకాలంలో ఓపెన్ అయినా ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారని డీసీపీ వెల్లడించారు. మంత్రి నారాయణ కొడుకు బుధవారం వేకువజామున మృతి చెందిన విషయం తెలిసిందే.

రెప్పపాటు వేగంలో పిల్లర్‌ను ఢీకొంది
కాగా, నిషిత్, అతని స్నేహితుడు రవిచంద్ర ప్రయాణిస్తున్న బెంజ్ కారు మెట్రో పిల్లర్ నెంబర్ 9ను బలంగా ఢీకొంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పోలీసులు విడుదల చేశారు. ఇందులో కారు రెప్పపాటు వేగంలో ఫిల్లర్‌ను ఢీకొన్న దృశ్యాలు ఉన్నాయి.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications