వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ పోలీస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు: దిగ్విజయ్ సింగ్‌పై కేసు నమోదు

తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయపరమైన సలహాలు తీసుకున్న పోలీసులు, ఆ తర్వాత డిగ్గీపై కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయపరమైన సలహాలు తీసుకున్న పోలీసులు, ఆ తర్వాత డిగ్గీపై కేసు నమోదు చేశారు.

తెలంగాణ పోలీసుపై తగ్గని డిగ్గీ: క్షమాపణకు వెంకయ్య డిమాండ్, మాగంటి ఫిర్యాదుతెలంగాణ పోలీసుపై తగ్గని డిగ్గీ: క్షమాపణకు వెంకయ్య డిమాండ్, మాగంటి ఫిర్యాదు

తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బంజారాహిల్స్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు డిగ్గీపై కేసు నమోదు చేశారు.

Digvijaya Singh booked for accusing Telangana cops of encouraging youth to join ISIS

తెలంగాణ పోలీసులు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లతో ముస్లిం యువకులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారంటూ దిగ్విజయ్ సింగ్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, తెలంగాణ పోలీసులు చేస్తున్న ఈ పనికి సీఎం కేసీఆర్ అనుమతి కూడా ఉందా? అంటూ ప్రశ్నించారు.

ఇలాంటి వ్యాఖ్యలా?, కాంగ్రెస్ నాశనమే: డిగ్గీపై డీఎస్ తీవ్ర వ్యాఖ్యలుఇలాంటి వ్యాఖ్యలా?, కాంగ్రెస్ నాశనమే: డిగ్గీపై డీఎస్ తీవ్ర వ్యాఖ్యలు

డిగ్గీపై వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహా రెడ్డి, ఎంపీ డీ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సార్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి, జాతీయ పార్టీలో కీలక వ్యక్తి ఉన్న ఓ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. ఆధారాలుంటే చూపాలని, అనవసరమైన ఆరోపణలు చేయొద్దని డీజీపీ అనురాగ్ శర్మ.. డిగ్గీకి సూచించారు.

English summary
The Hyderabad police on Thursday registered a case against Digvijaya Singh for his controversial tweet. A case was registered at the Jubilee Hills Police Station for his tweets defaming the image of Telangana Police and the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X