Dog Attack: సిద్దిపేటలో కుక్కల హల్‍చల్.. అదనపు కలెక్టర్‍పై..
తెలంగాణలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. తాజాగా సిద్దిపేట కలెక్టరేట్ లో కుక్కలు హల్ చల్ చేశాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని కుక్కలు కరిచాయి. వీధి కుక్కలు పెంపుడు కుక్కను కూడా గాయపరిచాయి. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 1వ రాత్రి అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తాను నివాసముంటున్న క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తుండగా ఓ వీధి కుక్క దాడి చేసింది. దీంతో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీనివాస్ రెడ్డిని వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కలెక్టరేట్‌కు సమీపంలోని పౌల్ట్రీఫాం వద్ద కూడా ఓ బాలుడిని కూడా కుక్క కరిచింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడినిపై కుక్కలు దాడి చేసి చంపాయి. ఆ తర్వాత రాష్ట్రంలో కుక్క కాటు ఘటనలు ఎన్నో జరిగాయి. ఖమ్మం జిల్లాలో కూడా ఓ బాలుడు కుక్కల దాడిలో మృతి చెందాడు.

రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కుక్కలను అదుపు చేయాలని అధికారులను కోరుతున్నారు. ఉన్నతస్థాయి అధికారులకే కుక్క కాట్లు తప్పడం లేదంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోమవారం కర్ణాటకలోని శివమొగ్గ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ కుక్క అప్పుడే పుట్టిన శిశువును నోట కరుచుకుని ఆస్పత్రి ఆవరణలో తిరిగిన ఘటన సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications