కలకలం: ల్యాండవుతూ పైకి.. మళ్లీ కిందికి, విమానంలోనే కేసీఆర్ ఫ్యామిలీ

తిరుపతిలో రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా అందర్నీ ఆందోళనకు గురి చేసింది. సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో మళ్లీ గాల్లోకి ఎగిరింది.

చిత్తూరు: తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా అందర్నీ ఆందోళనకు గురి చేసింది. సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో మళ్లీ గాల్లోకి ఎగిరింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మళ్లీ పైకి లేచింది. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఆ తర్వాత మరో 20 నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టి, ఆ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అదే విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులు, అధికారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు ఆరా తీస్తున్నారు.

Engine defect: Air India plane landed safely after take off

తన కోరిక అయిన తెలంగాణ సిద్ధించిన నేపథ్యంలో తిరుమల వెంకన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు కేసీఆర్ తిరుమల వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బయల్దేరుతున్నారు. కాగా, అంతకు ముందే ఆయన కుటుంబసభ్యులు ఎయిరిండియా విమానంలో తిరుపతికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+