షాక్: దేవుడి కొడుకుని, 18 ఏళ్లే బతకాలని జీవరహస్యం అంటూ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: తాను మల్లికార్జున స్వామి దేవుడి పుత్రుడినని, శాపగ్రస్తుడిగా పుట్టిన తనకు పద్దెనిమిదేళ్లు మాత్రమే జీవించాలనేది జన్మ రహస్యమని పేర్కొంటూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన హైదరాబాదులో జరిగింది.
కూకట్‌పల్లికి చెందిన గద్దె మహేష్ తనయుడు మనోజ్ కుమార్ ఘట్‌కేసర్‌లోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తాను దేవుడి కుమారుడినని చెప్పుకుంటూ కొన్ానాళ్లుగా పూర్తిగా ఆధ్యాత్మిక భావనలతో గడుపుతున్నాడు.

ఇటీవల కాలేజీకి సరిగా వెళ్లకుండా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వారు ఉంటున్న కింది అంతస్తులోని ఖాళీగా ఉన్న గదిలో మనోజ్ కుమార్ ఉరేసుకొని చనిపోయాడు. శుక్రవారం రాత్రి గుర్తించారు. అతను చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాశాడు.
అతను అయిదు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేఖలో తాను దేవుడి కొడుకునని, ఆయన ఆదేశాల మేరకు తనువు చాలిస్తున్నట్లు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications