ఘర్షణ, రాళ్ల దాడి: గాయపడిన ఎస్సై, ఎర్రబెల్లిపై హత్యాయత్నం కేసు
వరంగల్: వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మరో 17 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు అడిషినల్ ఎస్పీ, జనగామ ఇన్‌చార్జి డీఎస్పీ సంఘం జాన్‌వెస్లీ తెలిపారు. ఆదివారం రాత్రి వరంగల్ జిల్లా పాలకుర్తి పోలీస్టేషన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డు గోదాంల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తన అనుచరులతో కలిసి పోలీసులపై, టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని వివరించారు. దీంతో ఎమ్మెల్యే ఎర్రబెల్లితో పాటు మరో 17 మంది టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం, దొమ్మి, పోలీసులపై దాడి, కుట్ర కేసులతోపాటు ఇతర కేసులు కూడా నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. సమావేశంలో సీఐ తిరుపతి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాకముందే పాలకుర్తిలో మార్కె ట్ గోదాం శంకుస్థాపనకు టీడీఎల్పీనేత, స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీనిని అడ్డుకోబోయిన టీఆర్‌ఎస్ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎస్సైసహా పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి.
వరంగల్ జిల్లా పాలకుర్తిలో నిర్మించనున్న చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డు గోడౌన్ శంకుస్థాపనకు ఆదివారం డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి రావాల్సి ఉన్నది. ఈ క్రమంలో శ్రీహరి రాకముందే స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా మార్కెట్‌కు వచ్చా రు. యార్డులోని శిలాఫలకాన్ని ప్రారంభించడానికి కార్యకర్తలతో కలిసి ఎర్రబెల్లి ముందుకెళ్లగా టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నా యి.

దీంతో ఇరువర్గాల కార్యకర్తలు పరస్పర నినాదాలు చేశారు. ఒక్క సారిగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితిలో రాళ్ల వర్షం ప్రారంభమైంది. టీడీపీ కార్యకర్తలు టెంట్‌ను కూల్చి వేసి ఎర్రబెల్లితో కలిసి మార్కెట్ బయటకు వెళ్లి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు.
విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎస్సై ఎండీ ఉస్మాన్ షరీఫ్ హుటాహుటిన మార్కెట్‌కు వచ్చి పరిస్థితిని చక్క దిద్దేందుకు లాఠీచార్జి చేశారు. దీంతో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా కార్యకర్తలను కొడతావా.." అంటూ ఎస్సై పైకి దూసుకెళ్లారు. అదే సమయంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు రాళ్లతో ఎస్సైపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్సై తలకు తీవ్రగాయమైంది. రక్తమోడుతున్న ఎస్సైని పోలీసులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ నర్సింగ్ హోంకు తరలించారు.
ఎస్సైతోపాటు మీడియా ప్రతినిధులకు, టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, మార్కెట్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో దయాకర్‌రావు తన కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో ఇన్‌చార్జి డీఎస్పీ జాన్‌వేస్లి తన బలగాలతో వచ్చి దయాకర్‌రావును అరెస్టు చేసి నర్మెట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఎర్రబెల్లికి 14 రోజుల రిమాండ్వ
హత్యాయత్నం కేసులో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు జనగాం న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. పాలకుర్తిలో నిన్న టిఆర్ఎస్, టిడిపి కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో నిందితుడిగా ఎర్రబెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని రాత్రంతా బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచి సోమవారం ఉదయం జనగాం కోర్టులో హాజరుపరిచారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎర్రబెల్లిని ఏ1 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఎర్రబెల్లితో సహా 21 మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.












Click it and Unblock the Notifications