ప్రగతి భవన్ కేంద్రంగా కుట్రలు: ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి ట్వీట్‌పై చురకలు

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితమే పునరావృతమవుతుందని బీజేపీ సీనీయిర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఈటల రాజేందర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ నాయకులే సీఎం కేసీఆర్ ప్రవర్తన సరిగా లేదని అసహ్యించుకుంటున్నారని అన్నారు.

ప్రగతిభవన్ కేంద్రంగా జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కేసీఆర్, కేటీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానాల్లో అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పే మాటలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితమే వస్తుందన్నారు ఈటల రాజేందర్.

eatalarajendrajithenderreddy

మరోవైపు, బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పెట్టిన ట్వీట్ వివాదాస్పదం కావడంపై ఈటల రాజేందర్ స్పందించారు. జితేందర్ రెడ్డి ఉద్దేశమేంటో ఆయన్నే అడగాలని సూచించారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. బాధ్యత మరిచి ఏది పడితే అది మాట్లాడకూడదని హితవు పలికారు. ఇతరుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర బీజేపీలో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న వేళ.. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ ఇటీవలే ఓ ట్వీట్​ చేసిన సంగతి తెలిసిందే. వాహనంలోకి బలవంతంగా గేదెలు ఎక్కిస్తున్న వీడియోను పోస్టు చేసిన ఆయన.. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమని రాసుకొచ్చారు. దీనిపై పార్టీ వర్గాల్లో వ్యతిరేకత రాగా.. వెంటనే డిలీట్ చేశారు. దీనిపై ఆయన వివరణ కూడా ఇచ్చారు.

బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించేవారి గురించి ఆ ట్వీట్ అని తెలిపారు. బీఆర్ఎస్, సహా ఇతర పార్టీలు తన ట్వీట్‌ను తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అయితే, జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ మాత్రం బీజేపీలోనే గాక రాజకీయంగానూ కలకలం రేపింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+