పొంగులేటి ఎట్టకేలకు తేల్చేసారు - పార్టీ, ముహూర్తం ఫిక్స్..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొన్ని నెలల కాలంగా మాజీ ఎంపీ పొంగులేటి ఏ పార్టీలో చేరుతారనేది సస్పెన్స్ కొనసాగుతోంది. మాజీ మంత్రి జూపల్లి సైతం పొంగులేటితో జత కలిసారు. ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఎట్టకేలకు పొంగులేటి రాజకీయంగా తాను చేరే పార్టీ ఖరారు చేసారు. తన ముఖ్య అనుచరలతో సమావేశమయ్యారు. ఈ నెల 12న కీలక ప్రకటనకు నిర్ణయించారు.

కాంగ్రెస్ లోకి పొంగులేటి : మాజీ ఎంపీ పొంగులేటి బీఆర్ఎస్ తో విభేదించిన తరువాత కొత్త పార్టీ ఎంట్రీపై సుదీర్ఘంగా మంతనాలు చేస్తున్నారు. తొలుత బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. బీజేపీకి చెందిన ముఖ్య నేతలు ఖమ్మం వెళ్లి పొంగులేటితో భేటీ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన మద్దతుదారులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.

 pongu

ఆ తరువాత వైఎస్సార్టీపీలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. ఇంతలో కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి ముఖ్య నేతలు పొంగులేటిని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇదే సమయంలో పొంగులేటితో మాజీ మంత్రి జూపలి కూడా కలిసారు. ఇద్దరూ కలిసే ఒకే పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇక, ఈ వ్యవహారానికి ముగింపు ఇచ్చేందుకు పొంగులేటి ఖమ్మంలో తన అనుచరవర్గంతో సమావేశమయ్యారు.

12న అధికారిక ప్రకటన : అభిమానులు..అనుచరుల నుంచి పొంగులేటి అభిప్రాయ సేకరణ చేసారు. మెజార్టీ అభిప్రాయం కాంగ్రెస్ లో చేరాలని సూచనగా వచ్చింది. దీంతో, తన అనుచర వర్గంతో కాంగ్రెస్ లో చేరేందుకు పొంగులేటి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 12న పొంగులేటి, జూపల్లి ఇద్దరూ కలిసి తమ రాజకీయం నిర్ణయం ప్రకటించేందుకు ముహూర్తంగా ఖరారు చేసారు.

ఈ ఇద్దరి చేరిక పైన తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గేతో చర్చించారు. ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమైన రేవంత్ చేరికల గురించి వివరించారు. సమాచారం. ఈ నెల 12న జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత ఇచ్చే అవకాశముందని రేవంత్ పార్టీ నేతలకు వెల్లడించారు. నెల 10న టీపీసీసీ ముఖ్యనేతల సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమయంలో పార్టీ చేరికల గురించి వెల్లడించే అవకాశం ఉంది.

 ponguletisrinivasreddy

ఖమ్మం లో భారీ సభ..చేరిక : అనుచరులతో సమావేశమైన పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఏ పార్టీలో చేరాలని డిసైడ్ అయ్యాయని చెప్పుకొచ్చారు. మరో మూడు రోజుల్లో ప్రకటన చేస్తానని చెప్పారు. అనుచరులు..అభిమానుల సూచన మేరకే నిర్ణయమని స్పష్టం చేసారు. తన పైన మాట్లాడుతున్న నేతలకు వడ్డీతో సహా చెల్లించే సమయం దగ్గరపడిందని చెప్పుకొచ్చారు.

తాను ఓ పార్టీలో చేరతానని బీఆర్‌ఎస్ నేతలు ఊహించారని చెప్పారు. దాంతో మందు పార్టీ నేతలు పండగ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అయితే మారిన తన వ్యూహంతో ఇప్పుడు వాళ్లకు నిద్రపట్టడం లేదన్నారు. తాను ఏ పార్టీలో ఎప్పుడు చేరతానో అధికారికంగా హైదరాబాద్‌లో వెల్లడిస్తానని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+