రామచంద్రాపురం ఇండస్ట్రీయల్ ఏరియాలో అగ్ని ప్రమాదం, రూ.5 కోట్ల నష్టం?
హైదరాబాద్: హైద్రాబాద్ రామచంద్రాపురం పారిశ్రామిక వాడలోని బండ్లగూడ అగర్వాల్ గోడౌన్‌లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. సుమారు రూ5 కోట్ల ఆస్తినష్టం సంభవించింది.ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
హైద్రాబాద్ రామచంద్రాపురం పారిశ్రామిక వాడలోని బండ్లగూడ అగర్వాల్ గోడౌన్‌లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.

టైర్ల గోడౌన్ కావడంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగు గంటలుగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే అగ్ని ప్రమాదం ఎలా సంబవించిందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ సుమారు రూ.5 కోట్ల రూపాయాల ఆస్తి నష్టం చోటు చేసుకొందని సమాచారం.












Click it and Unblock the Notifications