మంత్రి నారాయణ కొడుకు మద్యం తాగలేదు: ఫోరెన్సిక్‌లో ఇలా.., గుండెలు బాదుకున్న చెల్లి

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ, రాజా రవివర్మలు మద్యం సేవించలేదని ఫోరెన్సిక్ వైద్యుల బృందం బుధవారం వెల్లడించింది.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ, రాజా రవివర్మలు మద్యం సేవించలేదని ఫోరెన్సిక్ వైద్యుల బృందం బుధవారం వెల్లడించింది. పోస్టుమార్టం అనంతరం వారు వివరాలను వెల్లడించారు.

మృతదేహాలకు అపోలో మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నెల్లూరుకు తరలించనున్నారు. అనంతరం ఫోరెన్సిక్ వైద్యులు మాట్లాడారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు.

పక్కటెముకలు విరిగాయి

పక్కటెముకలు విరిగాయి

ప్రమాదంలో నిషిత్ ఛాతి, పక్కటెముకలు విరిగాయని ఫోరెన్సిక్ వైద్యులు చెప్పారు. ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోనే వారు చనిపోయి ఉంటారని తెలిపారు. రవివర్మ కంటే నిషిత్‌కు ఎక్కువ గాయాలయ్యాయన్నారు. బలంగా దెబ్బలు తగలగడంతో మృతి చెందారని చెప్పారు.

నిషిత్‌కు స్టీరింగ్ వల్ల బలమైన గాయం

నిషిత్‌కు స్టీరింగ్ వల్ల బలమైన గాయం

డ్రైవింగ్ సీటులోని నిషిత్‌కు స్టీరింగ్ బలంగా తాకిందని చెప్పారు. లివర్ కూడా ముక్కలు ముక్కలు అయిందన్నారు. అతివేగంతో పిల్లర్‌ను ఢీకొనడం వల్ల ఇరువురు చనిపోయారని చెప్పారు.

కారు తొలగింపు

కారు తొలగింపు

ఇదిలా ఉండగా, ప్రమాదం అనంతరం కారులోంచి మృతదేహాలను పోలీసులు వెలికి తీసిన అనంతరం.. మృతదేహాలను అపోలో ఆసుపత్రికి తరలించి, కారును అక్కడి నుంచి తీసేశారు. మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో మీడియా సంస్థలన్నీ ప్రమాదానికి గురైన కారును వెతికే ప్రయత్నం చేశాయి. కారు మాత్రం కనిపించలేదు.

కారు ఎక్కడంటే..

కారు ఎక్కడంటే..

కారుపై స్థానికంగా ఉన్న కొందరిని అడగగా.. కారును ఎవరూ ప్రయివేటు వ్యక్తులు తరలించారని చెప్పారని తెలుస్తోంది. దీంతో మరింత లోతుగా ఆరా తీసిన మీడియా సంస్థలు కారును రహమత్ నగర్ అవుట్ పోస్టు పోలీస్ స్టేషన్ వెనుకనున్న పారిశ్రామిక విద్యాసంస్థకు చెందిన ఖాళీ ప్రదేశంలో గుర్తించారని అంటున్నారు. కారును అక్కడ గుట్టుగా ఎందుకు ఉంచారనేది తేలడం లేదంటున్నారు.

నుజ్జునుజ్జు అయిన కారు

నుజ్జునుజ్జు అయిన కారు

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో బెంజ్‌ కారు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ నారాయణ, అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న బెంజ్‌ జి-63 కారు నుజ్జునుజ్జైపోయింది.

ఈ కార్లకు రక్షణ ఏర్పాట్లు ఉంటాయి

ఈ కార్లకు రక్షణ ఏర్పాట్లు ఉంటాయి

సాధారణంగా బెంజ్‌లో అత్యున్నత శ్రేణికి చెందిన ఏఎంజీ సిరీస్‌ కార్లకు రక్షణ ఏర్పాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకున్నా నిషిత్‌, రాజాల ప్రాణాలను కాపాడలేకపోయాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఇంజిన్‌ భాగాలు మొత్తం మెలితిరిగిపోయాయి. దీంతో కారులో నుంచి వెలికి తీసేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

గంటకు 120 కి.మీ. వేగంతో..

గంటకు 120 కి.మీ. వేగంతో..

కాగా, కారు గంటకు 120 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారని తెలుస్తోంది. కారులో మద్యం సీసాలు గుర్తించారని ప్రచారం జరిగింది. కానీ వారు మద్యం తాగలేదని తేలింది. ప్రమాదం సమయంలో ఇద్దరు సీటు బెల్టు పెట్టుకోలేదని అంటున్నారు.

రవివర్మ కుటుంబం కన్నీరుమున్నీరు

రవివర్మ కుటుంబం కన్నీరుమున్నీరు

ఇదిలా ఉండగా, రోడ్డు ప్రమాదంలో నారాయణ కొడుకుతో పాటు దుర్మరణం చెందిన రాజా రవివర్మ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అపోలో ఆసుపత్రిలో రవివర్మ మృతదేహం చూసి వారు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. రవివర్మ చెల్లి విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+