మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత: కేసీఆర్ తీవ్ర సంతాపం

కుమ్రంభీం: జిల్లాలోని సిర్పూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మ(68) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తన స్వగృహంలోనే మృతి చెందారు. సమ్మయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

2009, 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ తరపున రెండుసార్లు పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి కావేటి సమ్మయ్య రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2018 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావేటి సమ్మయ్య మృతి పట్ల కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

former mla kaveti sammaiah passed away

సమ్మయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం

Recommended Video

    YS Jagan & KCR Have Different Opinion On Lockdown Lifting

    మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తదితర నేతలు సంతాపం తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+