మంటల్లో కాలిపోయిన గరుడ బస్సు, డ్రైవర్ జాగ్రత్తతో అందరూ సేఫ్
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న గరుడ బస్సులో మంగళవారం నాడు మంటలు వచ్చాయి. హఠాత్తుగా మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై.. బస్సును పక్కకు ఆపేశాడు.
ఆలేరు: హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న గరుడ బస్సులో మంగళవారం నాడు మంటలు వచ్చాయి. హఠాత్తుగా మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై.. బస్సును పక్కకు ఆపేశాడు.
దీంతో బస్సులోని ప్రయాణీకులు అందరు కిందకు దిగిపోయారు. మంటలు అంటుకున్న బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన ఆలేరు సమీపంలో చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

బస్సు ప్రమాదంపై మంత్రి ఆరా
ఆలేరు సమీపంలో బస్సు ప్రమాదం పైన రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అధికారుల నుంచి ఆరా తీశారు. ఎండలు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications