ప్రేమించానని, యువతిని స్నేహితులకు అప్పగించాడు, గ్యాంగ్ రేప్
వరంగల్: ప్రేమ పేరుతో యువతిని మోసం చేయడమే కాకుండా మాయమాటలతో తీసుకు వెళ్లి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని లింగల ఘనపురం మండలంలో జరిగింది.
తాను ప్రేమిస్తున్నానని ఓ గ్రామానికి చెందిన యువతికి అదే గ్రామానికి చెందిన యువకుడు చెప్పాడు. మాటమాటలతో తన వెంట తీసుకు వెళ్లాడు. అతని మాటలు నమ్మిన ఆమె అతనితో వెళ్లింది.
అయితే, ఆమెను తీసుకు వెళ్లిన ఆ వ్యక్తి తన స్నేహితులకు యువతిని అప్పజెప్పాడు. అనంతరం అతను, స్నేహితులు కలిసి ఆమె పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యం
సికింద్రాబాదులోని మహాత్మా గాంధీ ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన తొమ్మిది నెలల పాప ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కిడ్నాప్‌కు పాల్పడిన దివ్యజ్యోతి, రవితేజలను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఆర్మీ వాహనం ఢీకొని ముగ్గురు మృతి
సికింద్రాబాదులోని బోయిన్‌పల్లి ప్రాంతంలో బుధవారం ఉదయం ఆర్మీ వాహనం మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. గాయపడిన మరికొందరిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications