గుడ్ న్యూస్: రైతులకు అకౌంట్‌లోకి రూ.9500 జమ
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను పీఎం కిసాన్ యోజన అని కూడా అంటారు. 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించిన విప్తవాత్మక కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. సన్న, చిన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందజేసేందుకు దీన్ని తీసుకువచ్చారు. వీరికి ఆర్థిక సహాయం అందించడం, వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడం, జీవనోపాధిని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం.
మే చివరకు.. లేదంటే జూన్ లో
దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలతోపాటు ఏపీ తెలంగాణ రైతులు కూడా 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురుచూస్తున్నారు. వారికి 16వ విడత డబ్బులు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ పథకం కింద డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే పడతాయి. ప్రతి వాయిదాకు రూ.2వేల చొప్పుడు మూడు విడతల్లో మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. 17వ విడత డబ్బు మే చివరికి లేదంటే జూన్ మొదటివారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రతి ఏడాది రూ.21వేలు
దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 17వ విడత కోసం రైతులు ఈకేవైసీ చేయించుకోవాలి. కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్రం రైతులకు ఏటా రూ.6వేలు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ద్వారా రూ.10వేలు అందిస్తోంది. వచ్చే వర్షాకాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని రైతులందరికీ రైతు భరోసా పేరుతో రూ.15వేలు అందించబోతోంది. మొత్తంగా అన్నదాతలకు ప్రతి సంవత్సరం రూ.21వేల చొప్పున వారి ఖాతాల్లో జమవుతున్నాయి.
ఈకేవైసీ తప్పనిసరి
జూన్ మొదటివారంలో రూ.2వేలు జమైన తర్వాత వర్షాకాలంలో తెలంగాణ రైతుల ఖాతాలో ఎకరాకు రూ.7500 వేయనున్నారు. ఒకేసారి రైతులకు రూ.9500 పెట్టుబడి సాయం కింద అందనున్నాయి. pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ , PM కిసాన్ సమ్మాన్ నిధి హెల్ప్‌లైన్ నంబర్ 1800-945-8955లో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అయితే రైతులు తప్పనిసరిగా 17వ విడత డబ్బుల కోసం ఈకేవైసీ చేయించుకోవాలి.












Click it and Unblock the Notifications