తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: మరో రెండు రోజుల్లోనే నిధుల జమ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. మరో రెండురోజుల్లోనే రైతు భరోసా నిధులు 90 శాతం మంది రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలించడం జరుగుతుందన్నారు.

ఆ భూములు మినహా వ్యవసాయ భూములకు రైతుబంధు నిధులు మరో రెండు రోజుల్లో జమవుతాయని మంత్రి తుమ్మల చెప్పారు. ఉగాది రోజున ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

Good news for Telangana farmers Rythubharosa funds to be deposited in next two days

మరోవైపు, కొత్తగూడెం పట్టణంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్రమంత్రిని కలిసి కోరడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తే దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రం మరింత ప్రాచుర్యం పొందుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, ఆదిలాబాద్ మీదుగా జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి తుమ్మల తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి జాతీయ రహదారి వల్ల గోదావరి పరివాహక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

రేవంత్ సర్కారు-గల్ఫ్ భరోసా

ప్రవాసీ మిత్ర సంస్థ "రేవంత్ సర్కారు - గల్ఫ్ భరోసా" పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్‌, ప్రవాసీ మిత్ర ప్రతినిధులు మంద భీమ్ రెడ్డి, పి. సునీల్ కుమార్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+