తెలంగాణ ఉద్యోగులకు, జర్నలిస్ట్ లకు అదిరిపోయే శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ఒక నూతన ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయిస్ మరియు జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అందిస్తున్న ప్రభుత్వం వెల్నెస్ సెంటర్లలో ఇకపై సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు కీలక ఆదేశాలను ఇచ్చారు.
జర్నలిస్టులు, ఉద్యోగులకు శుభవార్త
ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడమే ఈ మార్పుల వెనుక ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వెల్ నెస్ సెంటర్లు పనిచేస్తున్నాయని, ఈ వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టిందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఉద్యోగులకు, జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించడం కోసం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు, జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వెల్ నెస్ సెంటర్స్ లో సేవలు వేగవంతం
ప్రస్తుతం హైదరాబాద్ లోని ఖైరతాబాద్, కూకట్పల్లి వెల్నెస్ కేంద్రాల బాధ్యతలను నిమ్స్ ఆస్పత్రికి అప్పగించారు.దీంతో నిమ్స్ వైద్యులు నేరుగా వైద్య సేవలను అందిస్తారు. మిగిలిన 10 కేంద్రాలను వైద్య విభాగం పర్యవేక్షిస్తుంది. ఈ కేంద్రాలలో సేవలను మరింత వేగవంతం చేసేలా నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం వెల్నెస్ సెంటర్లలో సాధారణ వైద్యంతో పాటు, దంత చికిత్స, ఫిజియోథెరపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఆన్ లైన్ లో ఓపీ బుక్ చేసుకునేలా యాప్
ఇకపై కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ విభాగాలు దశలవారీగా ఏర్పాటు చేసి చికిత్స అందించనున్నారు. వైద్య సేవలలో జాప్యం నివారించడం కోసం ప్రభుత్వం సాంకేతికతను కూడా ఉపయోగించనుంది. దీనికి ఆన్లైన్లోనే ఓపీ స్లాట్ బుక్ చేసుకునేలాగా ఒక యాప్ ని కూడా రూపొందిస్తున్నారు. మందుల కొనుగోలు నుండి పంపిణీ వరకు పూర్తి ప్రక్రియను డిజిటలైజ్ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
వెల్ నెస్ సెంటర్స్ లో అధునాతన వసతులు
స్టాక్ వివరాలు కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రోగులకు, వారి సహాయార్థం వచ్చేవారికి వెయిటింగ్ ఏరియాలు, అవసరమైన రోగ నిర్ధారణ పరికరాలు ఈ సెంటర్లలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యోగులు, జర్నలిస్టులు వేరే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలు వెల్నెస్ సెంటర్ లలో ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. దీంతో ఉద్యోగులు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications