హైదరాబాద్‌లో 'గూగుల్' ప్రాంగణం: సీఈవో సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: భారత దేశ అవసరాల దృష్ట్యా కొత్త ఉత్పత్తుల కోసం హైదరాబాదులో నూతన ప్రాంగణం ఏర్పాటు చేస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయి బుధవారం నాడు చెప్పారు. భారత్‌లోని 100 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు.

వచ్చే డిసెంబరు నాటికి రైల్‌టెల్ సహకారంతో వైఫై సదుపాయం కల్పిస్తామన్నారు. రానున్న రోజుల్లో భారత్‌లోని వంద కోట్ల ఇంటర్నెట్ వినియోగదారుల కోసం మేం ఉత్పత్తులు తీసుకు వస్తామని చెప్పారు. రానున్న మూడేళ్లలో భారత్‌లోను మూడు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ తీసుకు వెళ్తామన్నారు.
తాను గూగుల్‌లో చేరడానికి ప్రేరేపించిన విషయాన్ని కూడా సుందర్ పిచాయ్ తెలిపారు. భారత దేశంలోని చిన్న నగరంలోని ఓ పేద బాలుడు, అలాగే స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పని చేసే ఆచార్యుడి విషయంలోను గూగుల్ సెర్చ్ వర్క్ ఒకేలా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications