Tamilisai: తెలంగాణ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.. గవర్నర్ తమిళి సై..
ఎప్పుడూ అధికారంగా నిర్వహించని సెప్టెంబర్ 17ను అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మొదటగా బీజేపీ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహిస్తామని తెలిపింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
సెప్టెంబర్ 17 గురించి తెలుసుకోవాలి..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళి సై హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. నిజాం నుంచి విముక్తి పొందిన విధానం గురించి ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోకుండా ఉండొద్దన్నారు.
Live: Hon'ble Governor of Telangana Smt @DrTamilisaiGuv inaugurates The Hyderabad Liberation Movement - Photo & Art Exhibition at Parade Grounds, Secunderabad. https://t.co/exJRZZ0YJE
— G Kishan Reddy (@kishanreddybjp) September 14, 2022

అమిత్ షా రాక
కాగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ నెల 17 వరకు కొనసాగనుంది. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications