ఆటోలనూ వదల్లేదు.. జీహెచ్ఎంసీలో గ్రేట్ గోల్ మాల్..

ప్రభుత్వ పథకాలు వంద శాతం అమలవ్వాలంటే.. పథకాలను జనానికి చేరవేయడంలో కింది స్థాయి సిబ్బంధి చాలా అప్రమత్తతతో వ్యవహరించాలి. కానీ ప్రస్తుతం దేశంలో అమలు అవుతున్న అన్ని పథకాల పరిస్థితి 'కంచె చేను మేసిన చందంగా' తయారైంది. బాధ్యాతయుతంగా మెలగాల్సిన అధికారులే చేతివాటాన్ని ప్రదర్శిస్తుండడంతో పథకాల అసలు ఉద్దేశ్యం దెబ్బ తిని మధ్యలో దూరినవారి జేబులు నిండుతున్నాయి.

తాజాగా స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన జీహెచ్ఎంసీ ఆటోల్లో వందకు పైగా ఆటోలు కనిపించకుండా పోయాయి. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద ఇచ్చిన ఈ ఆటోలు ఇప్పుడు ఏమైపోయాయో తెలియదు. అధికారుల నిర్లక్ష్యమో.. నిర్వహణ లోపమో.. గానీ మొత్తానికి 1790 ఆటోలను పంపిణీ చేస్తే 1644 ఆటోలు మాత్రమే ఇప్పుడు విధుల్లో దర్శనమిస్తున్నాయి. మరి కనిపించకుండా పోయిన ఆటోలను ఎవరు మాయం చేసినట్టో..!

great missing in ghmc

కాగా, విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమీషనర్.. గ్రేటర్ లో ఆటోల మిస్సింగ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+