కట్నం వేధింపులు!: హైదరాబాద్‌లో గుంటూరు మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: వరకట్న వేధింపులకు ఓ మహిళ బలైంది! భాగ్యనగరంలోని కూకట్‌పల్లి నిజాంపేట రోడ్డులోని సెవెన్ హిల్స్ శేషాద్రి అపార్టుమెంటులో ఉండే సుకన్య అనే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరక్టన వేధింపుల వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
సుకన్య భర్త మహేష్. తన భార్య కొంతకాలంగా తనకు దూరంగానే ఉంటోందని, వరకట్న వేధింపులు కాదని, తాను తన భార్య ఎప్పుడు వేధించలేదని, ఆమె తల్లిదండ్రుల ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకుందని భర్త ఆరోపిస్తున్నారు.
పెళ్లైనప్పటి నుంచి తన కూతురిని భర్త వేధిస్తున్నారని, అదనపు కట్నం కోసం డిమాండ్ చేసేవాడని సుకన్య తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా, సుకన్యది గుంటూరు జిల్లా అని తెలుస్తోంది. ఎక్కడికైనా వెళ్తే కుటుంబ సభ్యులను కాకుండా స్నేహితులను తీసుకు వెళ్లేవాడని ఆరోపించారు.

సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గణపతి వరంగల్ జిల్లాలో అదృశ్యమయ్యాడు. సికింద్రాబాద్ - మణుగూరు రైల్లో వెళ్తుండగా వరంగల్ జిల్లా కాజీపేట వద్ద గణపతి అదృశ్యమైనట్లు తోటి కానిస్టేబుల్ డోర్నరకల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గణపతి ఛత్తీస్‌గఢ్ కుంటాలోని సుక్మా బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన స్వస్థలం తమిళనాడులోని థేని జిల్లా అందిపట్టి.
లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య
భాగ్యనగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. ఈ సంఘటన పైన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications