కట్టడి చేయండి: హరీశ్ రావు, స్వీట్ తినిపించిన దత్తాత్రేయ(పిక్చర్స్)

హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏకపక్ష వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. శనివారంనాడు భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయలను కలిసి బోర్డు వైఖరిపై ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను, కేంద్ర మంత్రి దత్తాత్రేయను ఆయన స్వగృహంలో కలిసి కృష్ణాబోర్డు దాని పరిధి దాటి వ్యవహరించకుండా కేంద్రం వెంటనే జోక్యం చేసుకునేలా కృషి చేయాలని కోరుతూ వారికి లేఖలను అందించారు.

బోర్డు ఏకపక్ష వైఖరి వల్ల తెలంగాణకు జరుగబోయే నష్టాన్ని వివరించారు. ప్రాజెక్టులవారీగా ఎలాంటి నీటి పంపకాలు జరుగకపోయినా ఆ విషయంలో యాజమాన్య బోర్డు పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఫిర్యాదు చేశారు.
నగరంలో పర్యటిస్తున్న పార్లమెంటరీ కమిటీ దృష్టికి సైతం కృష్ణా బోర్డు వ్యవహారాన్ని తీసుకెళ్లారు.

కాగా, ఎంపీ హుకుంసింగ్ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో శనివారం సమావేశమైంది. కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరును ఈ బృందం సమీక్షించింది. ఈ సందర్భంగా అధికారులు కృష్ణా బోర్డు ఏకపక్ష నిర్ణయాలు, వీటివల్ల తెలంగాణకు కలిగే నష్టాలను పార్లమెంట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశంపై కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేసేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో ఎంపీలు, ఇరిగేషన్ శాఖ అధికారుల బృందం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా, సోమవారానికి వాయిదా పడింది.

అధికారులు అందుబాటులో లేనందున సమావేశం వాయిదా వేస్తున్నట్టు, సోమవారం సమావేశం అవుదామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి హరీశ్‌రావుకు ఫోన్ చేసి చెప్పారు. ముందుగా నిర్ణయమైన సమావేశానికి అధికారులు అందుబాటులో లేకపోవడం విశేషం. సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ఉద్దేశంతోనే కేంద్ర మంత్రి సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా బిజెపి సైతం జోక్యం చేసుకోవాలని మంత్రులు కోరుతున్నారు. నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను శనివారం ఉదయం కలిసి కృష్ణా బోర్డు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని వివరించారు.

కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా సహకరించాలని కోరారు. కృష్ణా బోర్డు వైఖరివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు అందజేసిన లేఖలో హరీశ్‌రావు వివరించారు. ఇదే అంశాన్ని పార్లమెంటరీ బృందానికి తెలంగాణ నీటిపారుదల అధికారులు తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ పూర్తి కాకముందే నదీ జలాల పంపిణీని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి కృష్ణా బోర్డు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

కృష్ణా నదీ జలాలను వినియోగిస్తున్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను సంప్రదించకుండా బోర్డు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలేంతవరకు బచావత్ నోటిఫికేషన్ జారీ చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

ఇప్పటి వరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పంపిణీ జరుగుతున్నదని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం రెండేళ్లపాటు పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ళపాటు సాగునీటి రంగంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఈ అన్యాయాన్ని తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగలేదని చెప్పారు. బోర్డు ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు తలొగ్గుతోందని ఆరోపించారు. రాష్ట్రాల పునర్వీభజన చట్టంలోని 87 (1), 85 (8) సబ్ సెక్షన్‌ల ప్రకారం కృష్ణా బోర్డు ముసాయిదా నోటిఫికేషన్ తయారు చేయలేదని ప్రభుత్వం తెలిపింది. బండారు దత్తాత్రేయను కలిసి బోర్డు ఏకపక్ష నిర్ణయాలపై హరీశ్‌రావు వివరంగా చెప్పారు. కాగా, రెండ్రోజుల క్రితం హరీశ్ రావు పుట్టిన రోజు కావడంతో తనను కలిసిందేకు వచ్చిన ఆయనకు దత్తాత్రేయ స్వీట్ తినిపించారు.

దత్తాత్రేయతో హరీశ్

దత్తాత్రేయతో హరీశ్

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏకపక్ష వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. శనివారంనాడు భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయలను కలిసి బోర్డు వైఖరిపై ఫిర్యాదు చేశారు.

దత్తాత్రేయతో హరీశ్

దత్తాత్రేయతో హరీశ్

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను, కేంద్ర మంత్రి దత్తాత్రేయను ఆయన స్వగృహంలో కలిసి కృష్ణాబోర్డు దాని పరిధి దాటి వ్యవహరించకుండా కేంద్రం వెంటనే జోక్యం చేసుకునేలా కృషి చేయాలని కోరుతూ వారికి లేఖలను అందించారు.

దత్తాత్రేయతో హరీశ్

దత్తాత్రేయతో హరీశ్

బోర్డు ఏకపక్ష వైఖరి వల్ల తెలంగాణకు జరుగబోయే నష్టాన్ని వివరించారు. ప్రాజెక్టులవారీగా ఎలాంటి నీటి పంపకాలు జరుగకపోయినా ఆ విషయంలో యాజమాన్య బోర్డు పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఫిర్యాదు చేశారు.

దత్తాత్రేయతో హరీశ్

దత్తాత్రేయతో హరీశ్

నగరంలో పర్యటిస్తున్న పార్లమెంటరీ కమిటీ దృష్టికి సైతం కృష్ణా బోర్డు వ్యవహారాన్ని తీసుకెళ్లారు. కాగా, ఎంపీ హుకుంసింగ్ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో శనివారం సమావేశమైంది.

దత్తాత్రేయతో హరీశ్

దత్తాత్రేయతో హరీశ్

కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరును ఈ బృందం సమీక్షించింది. ఈ సందర్భంగా అధికారులు కృష్ణా బోర్డు ఏకపక్ష నిర్ణయాలు, వీటివల్ల తెలంగాణకు కలిగే నష్టాలను పార్లమెంట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

దత్తాత్రేయతో హరీశ్

దత్తాత్రేయతో హరీశ్

ఇదే అంశంపై కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేసేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో ఎంపీలు, ఇరిగేషన్ శాఖ అధికారుల బృందం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా, సోమవారానికి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+