ఆలిండియా నెంబర్ 1 ర్యాంకు: రికార్డు సృష్టించిన హెచ్‌సీయూ విద్యార్థిని
హైదరాబాద్: పీహెచ్‌డీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిరోజూ ఏదో ఒక వివాదానికి వేదికగా మారినప్పటికీ, వర్సిటీలోని విద్యార్ధులు మాత్రం రికార్డులను సృష్టిస్తూనే ఉన్నారు. హెచ్‌సీయూలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రసూన అనే ఇంటిగ్రేటెడ్ విద్యార్థి సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో ఆలిండియా నెంబర్ 1 ర్యాంకును సాధించింది.
స్కూల్ ఆఫ్ మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిక్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ విద్యార్థిగా అడుగుపెట్టి ప్రస్తుతం ఫైనల్ ఇయర్‌లో ఉన్న ప్రసూనకు సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో 200 మార్కులకుగాను 158 మార్కులు వచ్చాయి. దీనిపై విద్యార్ధిని ప్రసూన మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా చదివానని చెప్పుకొచ్చింది.

తన డిపార్ట్‌మెంట్‌లోని ప్రొఫెసర్లు, యూనివర్సిటీ ఎంతగానో సహకారం అందించిందని కొనియాడింది. యూనివర్సిటీలో బోధన, పరిశోధన ఎంతో ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడింది. పరిశోధన రంగంవైపు వెళ్లేందుకే తాను హెచ్‌సీయూని ఎంచుకున్నట్లు చెప్పింది.
వచ్చే జూలై నెలలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్(టీఐఎఫ్ఆర్)లో పీహెచ్‌డీ ప్రవేశం పొందనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ నాల్గవ ర్యాంకు సాధించింది.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications