వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ సిఫార్సు ఉంటేనే రెమ్‌డెసివిర్ ఇస్తారా.?హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించాలి.!దాసోజు శ్రవణ్ డిమాండ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థని యుద్దప్రాతిపదికన పునరుద్ధరించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి బహిరంగ లేఖ రాశారు. కరోనా విపత్కక తరుణంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించడం ద్వారా సీఎం తన కక్ష్య పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు తప్పితే ప్రజల ప్రాణలు పట్ల ఎంత మాత్రం భాద్యత వ్యవహరించడం లేదని శ్రవణ్ విమర్శించారు. కరోనా చికిత్సకు సంజీవనిలా పని చేస్తున్న రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ వంటి మందులు కావాలంటే మంత్రి కేటీఆర్ సిఫార్సు కావాల్సివస్తుందని ఆరోపించారు.

 కరోనా క్లిష్ట సమయంలో ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం.. ఘాటుగా విమర్శించిన దాసోజు శ్రవణ్..

కరోనా క్లిష్ట సమయంలో ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం.. ఘాటుగా విమర్శించిన దాసోజు శ్రవణ్..

ఈటెల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా కనీసం ప్రజలకు అందుబాటులో వుండేవారు. కానీ కరోనా బాదితుడైన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆ శాఖని తీసుకొని ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రగతి భవన్ గేటు దాటని ముఖ్యమంత్రి ప్రజలకు కల్పించే భరోసా ఏంటని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఆసుపత్రులలో బెడ్స్ లేక, సకాలంలో ఆక్సిజన్ లభించకపోవడం వలన అనేక మంది ప్రజలు చనిపోతున్నారని, రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ వంటి ప్రాణాలను రక్షించే మందులు విపరీతమైన ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తోందని మండిపడ్డారు.

 ఫార్మా బ్లాక్ మార్కెట్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ? సూటిగా ప్రశ్నించిన ఏఐసిసి అధికార ప్రతినిధి..

ఫార్మా బ్లాక్ మార్కెట్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ? సూటిగా ప్రశ్నించిన ఏఐసిసి అధికార ప్రతినిధి..

ఇంటర్నేషనల్ ఫార్మా హాబ్ గా పిలవబతున్న హైదరాబాద్ నేడు మందుల కొరతతో ఇబ్బంది పడుతుంది. కోవాక్సిన్ హైదరాబాద్‌లో తయారవుతుంది కానీ తెలంగాణ ప్రజలకు టీకాలు వేసే కార్యచరణ లేకుండాపోయింది. ఇవన్నీ తెలంగాణలో పేలవమైన పాలనను ప్రతిబింబిస్తాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో అసలు ఆరోగ్య శాఖలో మంత్రి లేకుండా చేయడం దారుణమైన పాలనకు పరాకాష్ట అని శ్రవణ్ విమర్శించారు. నేడు చిల్లర రాజకీయాలు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం దురదృష్టకరమని, కరోనా విలయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చిల్లర రాజకీయాలకే ప్రాధన్యత ఇస్తూ ప్రజల రక్షణని గాలికి వదిలేయడం బాధారమని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 కరోనా కష్ట కాలంలో ఆరోగ్య మంత్రి లేకపోవడం దారుణం.. కేసీఆర్ నియంతృత్వానికి పరాకాష్ట అన్న కాంగ్రెస్..

కరోనా కష్ట కాలంలో ఆరోగ్య మంత్రి లేకపోవడం దారుణం.. కేసీఆర్ నియంతృత్వానికి పరాకాష్ట అన్న కాంగ్రెస్..

కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినపుడు సెకెండ్ వేవ్ కూడా వుంటుందని శాస్త్రవేత్తలు, సర్వేలు స్పష్టంగా చెప్పాయి. కరోనా విలయాన్ని ఎదురుకోవడానికి ప్రభుత్వాలు సిద్దంగా వుండాలని కూడా హెచ్చరించాయి. హెల్త్ సెక్టార్ పై ద్రుష్టి పెట్టాలని, ఆక్సిజన్, బెడ్లు అందుకోబాటులోకి తీసుకురావాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని, విపత్తుని ఎదురుకోవడానికి ఖాళీగా వున్న వైద్య సిబ్బంది ఖాళీలని వెంటనే భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ గా మేము కూడా అనేక సార్లు హెచ్చరించామని శ్రవణ్ తెలిపారు. కానీ ప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలను పెడచెవిన పెట్టి, ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని శ్రవణ్ మండిపడ్డారు.

 కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి.. వైద్య సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలన్న శ్రవణ్..

కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి.. వైద్య సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలన్న శ్రవణ్..

ప్రస్తుత N440K డబుల్ మ్యూటాంట్ కోవిడ్ వేరియంట్ పేరెంట్ స్ట్రెయిన్ కంటే 10 రెట్లు ఎక్కువ అంటువ్యాధి రెండు తెలుగు రాష్ట్రంలో వ్యాపిస్తుందని, కోవిడ్ 3 , 4 వేవ్స్ కూడా వచ్చే ఛాన్స్ వుందని ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తుచేసారు. ఈ నేపధ్యంలో సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణను అందించడం, ప్రజల జీవితాలను రక్షించడం ప్రభుత్వాల భాద్యత అని శ్రవణ్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా కార్యచరణ రూపొందించుకుని తెలంగాణలో బలమైన ఆరోగ్య, పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటేనే కోవిడ్ మూడు, నాలుగు దశలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు.

Recommended Video

Uttam Kumar Reddy's Video From Hospital.. COVID బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం

English summary
AICC spokesperson Dasoju Shravan demanded that the state declare a health emergency and restore the health care system on a war footing. In this context, he wrote an open letter to Telangana Chief Minister Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X