ఓట్ల అవకతవకలపై తీర్పు ఎల్లుండికి వాయిదా, ఈసీ ఓటర్ల జాబితా విడుదల చేసుకోవచ్చు

హైదరాబాద్: అసెంబ్లీ రద్దు, ఓట్ల అవకతవకల పిటిషన్లపై తీర్పును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బుధవారం రిజర్వ్‌లో పెట్టింది. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా అవకతవకలపై వాదనలు ముగిసిన అనంతరం తీర్పును ఎల్లుండికి (శుక్రవారం) వాయిదా వేశారు. ఈ నెల 12వ తేదీన ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసుకోవచ్చునని కోర్టు తెలిపింది.

బూత్ లెవల్ నుంచి ఓటర్ల జాబితా పైన 12వ తేదీన అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డీకే అరుణ, శశాంక్ రెడ్డి వేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మరో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్‌ను 12వ తేదీకి వాయిదా వేసింది. 12న అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

High Court reserve judgement on dissolution of Assembly

కాగా, ఓటర్ల జాబితాలో ఫిర్యాదుల పైన హైకోర్టు విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. సోమవారం కౌంటర్ దాఖలు చేయగా, ఈ రోజు వాదనలు జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+