కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్‌కు హైపవర్ కమిటీ నివేదిక
హైదరాబాద్: ముసాయిదా నోటిఫికేషన్‌లో ఇచ్చినవి కాకుండా అదనంగా సిరిసిల్ల, జనగామ, గద్వాల్, ఆసిఫాబాద్ జిల్లాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిటీ చైర్మన్ కేకే, సభ్యులుగా ఉన్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి నివేదిక అందజేశారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫికేషనను శనివారం లేదా ఆదివారం జారీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.












Click it and Unblock the Notifications