పెళ్ళాయ్యాక ట్విస్టిచ్చిన భార్య: లవర్‌తో అసభ్యంగా ఉన్న దృశ్యాలు భర్తకు షేర్

మంచిర్యాల: వివాహనికి ముందే ఓ యువకుడితో ప్రేమాయణం భర్త మరణానికి దారితీసింది . మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామపంచాయితీ పరిధిలోని శ్రీరాములపల్లె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివాహమైన తర్వాత కూడ ప్రియుడితో సంబంధాలు కొనసాగించడమే కాదు, ప్రియుడితో అసభ్యంగా ఉన్న దృశ్యాలను సెల్‌పోన్‌లో రికార్డు చేసి భర్తకు పంపడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఈ ఘటన మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ కొడుకు మరణానికి కారణమైన అతడి భార్యపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు పోలీసులను కోరారు.

పెళ్ళైన ప్రియుడితో సంబంధాలు

పెళ్ళైన ప్రియుడితో సంబంధాలు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామపంచాయితీ పరిధిలోని శ్రీరాముల పల్లెకు చెందిన ఓ యువకుడికి జగిత్యాల జిల్లా కన్నాపూర్‌కు చెందిన ఓ యువతికి గత ఏడాది వివాహమైంది. వీరిద్దరికి పెద్దలు సంప్రదాయం కుదిర్చారు. వివాహమైన తర్వాత కూడ ఆ యువతి ప్రియుడితో సంబంధాలు కొనసాగించింది. వివాహమైన రెండు మూడు మాసాలు బాగానే ఉన్నా, ఆ తర్వాత ప్రియుడితో తన సంబంధాలను కొనసాగించిందని బాధిత కుటుంబసభ్యులు చెప్పారు.

 పుట్టింటికి వెళ్ళి ప్రియుడితో కార్యక్రమాలు

పుట్టింటికి వెళ్ళి ప్రియుడితో కార్యక్రమాలు

పుట్టింటికి వెళ్ళిన సమయంలో తన ప్రియుడితో ఆమె తన సంబంధాలను కొనసాగించిందని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొంత కాలం పాటు చాటు మాటుగా ఈ వ్యవహరాన్ని నడిపించిన ఆ యువతి ఆ తర్వాత యధేచ్చగా ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడేదని వారు చెబుతున్నారు. అత్తింటికి వచ్చిన సమయంలో కూడ ప్రియుడితో పోన్‌లో మాట్లాడేదని, అసభ్యంగా కూడ తమ ముందే మాట్లాడేదని వారు ఆరోపిస్తున్నారు.

 ఆ దృశ్యాలను భర్తకు షేర్ చేసిన భార్య

ఆ దృశ్యాలను భర్తకు షేర్ చేసిన భార్య

ప్రియుడితో అసభ్యంగా ఉన్న దృశ్యాలను ఆమె సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసింది. అంతేకాదు భర్త కట్టిన తాళిని తీసివేయించి ప్రియుడితో ఆ తాళిని తన మెడలో వేయించుకొంది. ఈ దృశ్యాలను రికార్డు చేసి భర్తకు షేర్ చేసింది . ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు ఆ యువకుడు. అయితే భార్య ప్రియుడి సెల్‌ నెంబర్ తీసుకొని బాధిత కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే తాము ప్రేమించుకొన్నట్టు చెప్పాడు.

 ఆత్మహత్య చేసుకొన్న భర్త

ఆత్మహత్య చేసుకొన్న భర్త

భార్య ప్రియుడితో అసభ్యంగా ఉన్న దృశ్యాలు, తాళిని ప్రియుడితో కట్టించుకొన్న దృశ్యాలను చూసిన భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ దృశ్యాలతో తట్టుకోలేకపోయాడు. మార్చి 9న, పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+