పబ్లిక్ పార్కుల్లో అసభ్యం: 11 యువ జంటల అరెస్ట్
హైదరాబాద్: నగరలోని పలు పార్కుల్లో అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్న 11 జంటలను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి, తదితర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులే ఎక్కువగా ఈ పార్కుల్లో దర్శనమిస్తుండటం గమనార్హం.
కాగా, కళాశాలలకు సమీపంలోని నందనవనం పార్కులో యువ జంటల తాకిడి మరింత ఎక్కువగా ఉంది. ప్రశాంతత కోసం వచ్చే పలువురు పెద్దలు.. ఈ యువజంటలు చేస్తున్న అసభ్య కార్యకలాపాలపై తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. పబ్లిక్ న్యూసెన్స్ కింద పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు.

పార్కుల్లోని వివిధ ప్రాంతాల్లో కూర్చుంటున్న యువ జంటలు.. ఎవరినీ పట్టించుకోకుండా అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కాలేజీలకు వెళ్లడం మాని.. పార్కులకు వచ్చే ఇతరుల పట్ల కళాశాల విద్యార్థులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు చెప్పారు.
బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా వేసి సదరు జంటలను పట్టుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. వారిపై పెట్టి కేసు నమోదు చేసి, ఆ తర్వాత వదిలేశామని తెలిపారు. కాగా, విద్యార్థినీ, విద్యుర్థులు పార్కులకు రాకూడదా?, పోలీసులు తమను ఎందుకు వేధిస్తున్నారంటూ కొందరు విద్యార్థులు తిరిగి ప్రశ్నిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications