కోతి భయంతో హైదరాబాద్ నుండి చెన్నైకి

హైదరాబాద్ : రౌడీలు, గుండాలకు భయపడి ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్ళేవారిని చూశాం. కాని, కోతి భయంతో ఓ మహిళ .. ఊరే వదిలిన పెట్టిన ఘటన మారుమూల ప్రాంతంలో జరగలేదు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకొంది.

హైదరాబాద్ లోని సైదాబాద్ లోని కళ్యాణ్ నగర్ కాలనీలో సత్యవతి నివాసం ఉంటుంది.ఆమె వంట చేస్తుండగా ప్రదాన ద్వారం గుండా ఓ కోతి నేరుగా వంటింట్లోకి చేరుకొంది. కోతి తన సమీపానికి వచ్చేవరకు కూడ ఆమెచూడలేదు.కోతిని చూసి ఆమె భయపడి గట్టిగా కేకలు వేసింది.కోతి ఆమె చేయి పట్టుకొని కొరికింది.కోతి నుండి తప్పించుకొని ఆమె బయటకు పరుగులు తీసింది.

hyderabad to chennai shifting fear of monkey

స్థానికుల సహయంతో ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకొంది.తనను కోతి కరిచిన విషయాన్ని చెన్నైలో ని తన కొడుకుకు ఫోన్ లో వివరించింది.అతను హైద్రాబాద్ ను వదిలి చెన్నై రావాలని తల్లికి సలహా ఇచ్చాడు. వెంటనే టిక్కెట్లు బుక్ చేశాడు.వెంటనే ఆమె హైదరాబాద్ వదిలి చెన్నైకు వెళ్ళిపోయింది.
సైదాబాద్ ప్రాంతంలో కోతుల సమూహం స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ కోతి మూకలో రెండు కోతులకు మతి స్థిమితం కోల్పోయి కనిపించిన ప్రతి వారిని కరుస్తున్నాయి.సైదాబాద్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో సుమారు వంద మంది కోతుల బారిన పడి గాయపడ్డారు.ఇప్పటికీ కేవలం రెండు కోతులను మాత్రమే పట్టుకొన్నారు. మిగిలిన కోతుల జాడ కోసం వెతుకుతున్నారు అటవీశాఖాధికారులు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+