హైదరాబాదీలకు గుడ్‌న్యూస్: రేపట్నుంచే నుమాయిష్ ప్రారంభం, టైమింగ్స్ ఇవే
హైదరాబాద్: నగర వాసులకు కొత్త సంవత్సరం సందర్బంగా గుడ్‌న్యూస్ వచ్చింది. రేపట్నుంచి అంటే జనవరి 1 నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 82వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన(నుమాయిష్) ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

2400 స్టాళ్లతో హైదరాబాద్ నుమాయిష్ రెడీ
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరుక నిర్వహించే ఈ ప్రదర్శనకు కరోనా వైరస్, ఇతర కారణాల దృష్ట్యా గత రెండేళ్లుగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు చేపట్టింది. 1500 మంది ఎగ్జిబిటర్లతో 2400 స్టాళ్లు ఈ వస్తు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.

రేపట్నుంచే హైదరాబాద్ నుమాయిష్ ప్రారంభం
కాగా, దేశ, విదేశాలలో ప్రాముఖ్యత సంతరించుకున్న నుమాయిష్‌కు ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ ఏడాది 22 లక్షల మంది వరకు నుమాయిష్ కు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాట్లలో భాగంగా స్టాళ్ల కేటాయింపులు పూర్తికావడంతో స్ఠాళ్లు ఏర్పాటవుతున్నాయి. కొత్త సంవత్సరం వేళ ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు.

నుమాయిష్ ఎంట్రీ ఫీ, టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూకాశ్మీర్, పశ్చిమబెంగాల్, ఇతర రాష్ట్రాలకు చెందిన 2400 స్టాళ్లు ఎగ్జిబిషన్‌లో కొలువుదీరనున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుం రూ. 40గా నిర్ణయించారు. నుమాయిష్‌కు వచ్చేవారి కోసం ఉచిత పార్కింగ్ సౌకర్యం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అగ్నిమాపక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications