కరోనా వైరస్‌పై సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో..!!
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. మరణాలు సైతం నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతోన్న రాష్ట్రాలకు స్టాండర్ట్ ప్రొటోకాల్స్ ను జారీ చేశారు. కొన్ని రాష్ట్రాలు మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశాయి.
24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,880 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి పెరిగింది. మొత్తంగా 85,076 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,880 కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా వల్ల ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,30,979కి చేరింది. ఇప్పటివరకు 4,41,96,318 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ఈ పరిణామాల మధ్య హర్యానా, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. పాఠశాలల్లో మాస్కులను తప్పని సరి ధరించాల్సి ఉంటుందని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్‌ను నిర్వహించాల్సి ఉంటుందంటూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సూచించిన నేపథ్యంలో- అన్ని రాష్ట్రాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటోన్నాయి.

దేశంలో కోవిడ్, ఇన్‌ఫ్లుయెంజాల్లో భారీగా పెరుగుదల కనిపించినందున అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది కూడా. శ్వాసకోశ సంబంధ ఇబ్బందులతో బాధపడే వారిని గుర్తించడానికి ప్రత్యేకంగా ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని, రోజువారీ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. దీని ద్వారా పాజిటివ్ కేసుల సంఖ్యను నిర్ధారించవచ్చని స్పష్టం చేసింది.
ఇన్సాకాగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ లేబొరేటరీల్లో నమూనాల నిర్ధారించాలని, కంప్లీట్ జీనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతులను మరింత మెరుగుపర్చుతున్నారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, కోవిడ్ వ్యాప్తి చెందకుండా అయిదంచెల వ్యూహాలను అనుసరించాలని సూచిస్తూ.. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో- సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అధికారులు పూర్తిస్థాయి మాక్ డ్రిల్ చేపట్టారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో- వాటి బారిన పడిన వారికి ఎలాంటి ఆటంకం లేకుండా కోవిడ్ చికిత్సను అందించాలనేది ప్రభుత్వం లక్ష్యం. దీనికి అనుగుణంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మాక్‌డ్రిల్‌ను నిర్వహించా
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications