పబ్‌లతో ఇబ్బందులు.. బాటిల్స్ విసిరేస్తున్నారు... సిటీ వాసుల గగ్గోలు
ఒమిక్రాన్ హడలెత్తిస్తోన్న వేళ.. సెలబ్రేషన్స్‌కు బ్రేక్ పడింది. అయితే సిటీలో పబ్ మాత్రం కొనసాగుతున్నాయి. వీటి వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఇదివరకు హైకోర్టు కేసు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే మిగతా చోట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు.
హైదరాబాద్ నగరంలో పబ్‌లు స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎవరి ఇళ్లలో వారిని ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి నైట్ పబ్‌లు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో జనావాసాల మధ్య ఉన్న పబ్‌లను ఎత్తివేయాలని ఆందోళనకు దిగుతున్నారు స్థానికులు. తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టును సైతం ఆశ్రయించారు స్థానికులు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న థర్డ్ పబ్ వద్ద రోజూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లారేవరకు తాగుతూ.. రోడ్డుపై మద్యం బాటిళ్లు పడేస్తున్నారని చెబుతున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెండు రోజుల పాటు సమయానికి క్లోజ్ చేస్తున్నారని వివరించారు. కానీ ఆ తర్వాత మాత్రం సేమ్ సిచుయేషన్ అని వివరించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ తెల్లారేవరకు పబ్ నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పబ్ వల్ల ప్రశాంతతను కోల్పోతున్నామని స్థానికులు చెబుతున్నారు.
ఇటు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని కొందరు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications