వేరే వాడి వీర్యంతో భార్యకు సంతానం.. పుట్టిన బేబీకి ఆ భయంకర వ్యాధి..!

సాధారణంగా ఏ యువతి అయినా పెళ్లి అయిన తర్వాత అమ్మ అని పిలిపించుకునేందుకు పరితపిస్తుంది. అయితే ప్రస్తుత జీవన శైలి, మారుతున్న జీవన విధానం ప్రకారం సంతానం అందటం పెద్ద సమస్యగా మారింది. దీంతో భార్యాభర్తలు ప్రైవేటు ఆస్పత్రులు, టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ భారీ స్కామ్ బట్టబయలు అయింది. సంతానం కలిగిస్తామని రూ. లక్షలు లక్షలు గుంజుతున్న టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్లు అడ్డదారులు తొక్కుతున్నాయి. అలా ఎవరిది పడితే వారి వీర్యంతో సంతానోత్పత్తి చేస్తున్నారు అక్కడి వైద్యులు. ఈ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఓ జంటకు పిల్లలు లేరు. పిల్లల కోసం పరితపించిన ఆ కపుల్స్ హైదరాబాద్ లోని సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ ను ఆశ్రయించింది. అయితే తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని కోరింది ఆ మహిళ. అందుకు విరుద్ధంగా వైద్యురాలు ఆమె భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించింది. అయితే అప్పుడు ఆ మహిళ గుర్తించలేదు.

Hyderabad Srishti Test Tube Baby Center Under Scrutiny for Alleged Sperm Mix-Up

డెలివరీ అయ్యాక బిడ్డ పోలికలు, రంగుతో పాటుగా.. బిడ్డకు క్యాన్సర్ అని తేలింది. దీంతో ఆ కపుల్స్ శిశువుకు DNA టెస్ట్‌ చేయించారు. అయితే పరీక్షల్లో అది వేరే వారిదిగా తేలింది. దీంతో సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ బాగోతం బట్టబయలు అయింది. దీంతో బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దంపతులు అందించిన ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై సికింద్రాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్ నిర్వాహకులు, సంబంధిత వైద్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+