Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైద్రాబాద్‌లో ట్రిపుల్ తలాక్: భర్తపై న్యాయ పోరాటం, సుష్మా స్వరాజ్‌ సహయం కోరిన బాధితురాలు

హైదరాబాద్:ఎలాంటి కారణం లేకుండానే ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తపై ఓ భార్య న్యాయపోరాటానికి సిద్దమైంది. తనకు న్యాయం చేయాలని కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు బాధితురాలు లేఖ రాసింది.

హైద్రాబాద్‌కు చెందిన షేక్ చాంద్‌పాషా తన కూతురును 2008 ఆగష్టు 11వ, తేదిన ఒమన్‌కు చెందిన జహరన్ హమీద్ అల్ రజీ అనే వ్యక్తికిచ్చి పెళ్ళి చేశాడు. వివాహానికి కొందరు మధ్యవర్తిత్వం వహించారని బాధితురాలు మీడియాకు తెలిపింది.

Hyderabad woman claims Omani husband gave Triple Talaq over phone, seeks Sushma Swaraj’s help

వివాహం తర్వాత తన భర్త తనను ఒమన్‌కు తీసుకెళ్ళలేదని చెప్పారు. అప్పుడప్పుడు హైద్రాబాద్ వచ్చేవాడని తెలిపింది.హైద్రాబాద్‌కు వచ్చిన సమయంలో తనకు ఖర్చుల నిమిత్తం డబ్బులను ఇచ్చేవాడని బాధితురాలు తెలిపింది

హైద్రాబాద్‌లో తన భర్త తనకు ఇల్లును ఇప్పిస్తాడని హమీ ఇచ్చిందని బాధితురాలు తెలిపారు. అయితే తన గురించి తమ వివాహం జరిపించిన మధ్యవర్తుల ద్వారా సంప్రదిస్తే ఎప్పటికప్పుడు దాట వేసేవారని ఆమె చెప్పారు.

అయితే ఈ నెల 15వ, తేదిన జహరాన్ తనకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే తాను చేసిన తప్పేంటో చెప్పకుండా తలాక్ చెప్పడంలో ఆంతర్యమేమిటని బాధితురాలు ప్రశ్నించారు.ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+