మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవారు దేశద్రోహులుగా అభివర్ణించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని పాకిస్తాన్ పంపించాలని కోరారు. అదీ కూడా బ్రేకుల్లేని బస్సులో పంపించాలని బండి సంజయ్ అన్నారు. సీఏఏను వ్యతిరేకించడం అంటే దేశంలో ఉంటూ ద్రోహం చేయడమేనని గుర్తుచేశారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏను నిరసిస్తూ ఆందోళనకారులు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన ఆందోళనలు ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, బెంగళూర్‌కి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గత వారం ట్యాంక్‌బండ్‌పై దాదాపు 25 వేల మంది ముస్లింలు ర్యాలీ కూడా తీశారు.

సీఏఏకు అనుకూలంగా బీజేపీ ర్యాలీ నిర్వహిస్తుండగా.. వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఎంపీ బండి సంజయ్ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు దేశద్రోహులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులు రాళ్లు పట్టుకుంటే.. మేం బాంబులు పడతామని బండి సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపే అవకాశం ఉన్నది.












Click it and Unblock the Notifications