ముంచుకొస్తోంది, మూడు రోజులు దంచుడే - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
మరోసారి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు తాజా అలర్ట్స్ జారీ చేసింది. కొంత కాలంగా ఉదయం వేళ ఎండలు.. సాయంత్రం సమయంలో వర్షాలు సాధారణంగా మారాయి. కాగా, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఏపీ.. తెలంగాణ జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది.
వాతావరణ శాఖ మరో సారి వర్షాల పైన కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో ఆ ప్రభావంతో మరో మూడురోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోనూ నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వెల్లడించింది. ఇక రాయలసీమ ప్రాంతంలో ఈరోజు తేలికపాటి జల్లులు పడతాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ , వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.












Click it and Unblock the Notifications